దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా రౌద్రం రణం రుథిరం. 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాను 2021 సంక్రాంతి టార్గెట్ గా రాజమౌళి  సిద్దం చేస్తున్నారు. అయితే రీసెంట్ గా నిర్మాత v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య అన్న మాటలను బట్టి మరికాస్త ఆలస్యం అయ్యో అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమా నుండి చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్రను రిలీజ్ చేసిన చేసినప్పటి నుండి ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కొమరం భీం వీడియో టీజర్ ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

 

అయితే అందుకు ఇంకా కొన్ని రోజులుగా సమయం పడుతుందని ఇటీవల ఆర్.ఆర్.ఆర్ బృందం తెలిపారు. వాస్తవంగా అయితే ఈ నెల ఎన్.టి.ఆర్ బర్త్ డే కి తారక్ పాత్ర అయిన కొమరం భీం పాత్రని రివీల్ చేస్తారనుకున్నప్పటికి లాక్ డౌన్ మూలానా కుదరలేదు. ఇక ఆర్.ఆర్.ఆర్ లో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ రాం చరణ్ కి లవర్ గా .. సీత పాత్ర లో కనిపించనుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అంతేకాదు అలియా రోల్ ఆర్.ఆర్.ఆర్ లో చాల కీలకం అని విశ్వసనీయ వర్గాల సమాచారం. చరణ్ తో పాటు ఎన్టీఆర్ తో కూడా ఆలియాకి కీల సన్నివేశాలు ఉంటాయట. 

 

అంతేకాదు చరణ్ - ఎన్.టి.ఆర్ - ఆలియా మధ్య ఉద్యమానికి సంబంధించిన కీలక సన్నివేశాలు సినిమాలో ఎంతో హైలెట్ గా నిలవనున్నాయని లేటెస్ట్ న్యూస్. ఇక కథను మలుపు తిప్పుతు ఎన్.టి.ఆర్, చరణ్ లను కలిపేది కూడా ఆలియా భట్ అని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో ఆలియా పాత్ర బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ మాదిరిగా చాలా ఫరవ్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తుంది. ఇక పాన్ ఇండియా సినిమా కాబట్టి బాలీవుడ్ లో క్రేజ్ రావడం కోసం రాజమౌళి కొంతమంది బాలీవుడ్ నటులను ఎంచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: