మన తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి నటించిన బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో భారీ మల్టిస్టారర్ ( ఆర్.ఆర్.ఆర్ ) రౌద్రం, రణం రుథిరం. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్.టి.ఆర్, రాం చరణ్ లు అల్లూరి సీతారామరాజుగా, కొమరం భీం గా నటిసున్న సంగతి తెలిసిందే. అంతేకాదు బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్, సీనియర్ హీరో అజయ్ దేవగన్ వంటి భారీ కాన్వాయిస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక టాలీవుడ్ లో భారీ చమ్నాలున్న సినిమా కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య. 

 

ఈ సినిమాలో కాజల్ అగ్ర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా దేవదాయ దర్మదాయ శాఖలో జరుగుతున్న అవినీతి ని ప్రధాన అంశంగా తీసుకొని తెరకెక్కిస్తున్నారు. 2021 సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. అంతేకాదు రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సాహో తో నిరాశపరచిన ప్రభాస్ ఈ సారి భారీ సక్సస్ కొట్టాలన్నకసితో ఉన్నాడు. ఈ సినిమా ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తుండగా బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. 

 

ఇక కే.జి.ఎఫ్ ఛాప్టర్ 2 కూడా పాన్ ఇండియా సినిమాగానే నిర్మిచారు. ప్రశాంత్ నీల్-యశ్ కాంబినేషన్ లో ఇంతకముందు వచ్చిన కే.జి.ఎఫ్ కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటీ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి సుజీత్ కాంబినేషన్ లో నిర్మించబోయో లూసీఫర్ రీమేక్ ని కూడా పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేస్తున్నారు. ఇక పూరి జగన్నాధ్-విజయ్ దేవరకొండ సినిమా కూడా నాలుగు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది. దీంతో పాటు సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న పుష్ప సినిమా 5 భాషల్లో భారీ సినిమాగా పాన్ ఇండియా సినిమా గా రెడీ చేస్తున్నారు. 

 

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం, కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కతున్న భారతీయుడు 2 కూడా పాన్ ఇండియా సినిమాలుగానే రెడీ అవుతున్నాయి. అంతేకాదు మంచు మనోజ్ అహం బ్రహ్మాస్మి, ప్రభాస్ నాగ్ అశ్విన్ ల సినిమా..ఎన్.టి.ఆర్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగానే రూపొందిస్తున్నారు. అయితే చిన్న సినిమాలు కాస్త తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వాటిని డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ చేయాలన్న ఆలోచన కూడా కొంతమంది మేకర్స్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: