తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఉండిపోయిన నటుడు ఎన్టీఆర్. పౌరాణిక సినిమాలతో ప్రేక్షకులకు ఆరాధ్య నటుడైపోయారు. మాస్ కథాంశాల సినిమాలతో అభిమానులను అలరించారు. సినిమాలతోనే ఆయన సృష్టించిన ప్రభంజనం అలాంటిది. ఎందరో దర్శకులతో ఆయనకు మంచి బాండింగ్ ఉంది. మంచి పాత్రలు, కథాంశాలతో ఎన్టీఆర్ క్రేజ్ కు దోహదపడ్డారు. అలాంటి వారిలో దాసరి నారాయణరావు ఒకరు. దాసరి నారాయణరావుతో ఎన్టీఆర్ 5 సినిమాలు చేశారు. వాటిలో విశ్వరూపం, సర్కస్ రాముడు, మనుషులాం ఒకటే, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి ఉన్నాయి.

IHG

 

వీటిలో మనుషులంతా ఒకటే, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాయి. మనుషులంతా ఒకటే సినిమా ఎన్టీఆర్ కు ఉన్న మాస్ ఇమేజ్ తో పాటు సామాన్య ప్రజానీకానికి మరింత దగ్గర చేసిందనే చెప్పాలి. దేశభక్తి కథాంశంతో తెరకెక్కిన సర్దార్ పాపారాయుడు తిరుగులేని హిట్ సాధించింది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేసిన సినిమా బొబ్బిలిపులి. ఆయన గాంభీర్యానికి, ఆహార్యానికి తగ్గ కథ రాశారు దాసరి. ఈ సినిమాలో ఎన్టీఆర్ విశ్వరూపమే చూశారు ఆనాటి ప్రేక్షకులు. దాసరి రాసిన మాటలను ఎన్టీఆర్ డైలాగులు చెప్పిన విధానం అభిమానుల చేత ఈలలు వేయిస్తే ప్రేక్షకుల చేత క్లాప్స్ కొట్టించాయి. ఓ హిట్ సినిమా చేసి జనాల్లోకి వెళ్లారు.

IHG

 

మొదటి రెండు సినిమాలు పెద్దగా ఆడకపోయినా తర్వాతి మూడు సినిమాలు దాసరి – ఎన్టీఆర్ కాంబినేషన్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులుగా నిలిచిపోయాయి. ఎన్టీఆర్ కు ఎందరో ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చారు. వీరిలో దాసరి కూడా ఆయనకు ఇష్టమైన దర్శకుడిగా మారిపోయారు. బొబ్బిలి పులి అనంతరం రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు. దాసరి తెరకెక్కించిన ఈ సినిమాలతో ఎన్టీఆర్ కే కాకుండా దాసరి కెరీర్లో కూడా మైలురాళ్లుగా నిలిచిపోయాయి.

IHG

  

మరింత సమాచారం తెలుసుకోండి: