సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోయిన్ గా రాణించాలంటే ఖచ్చితంగా క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఇదే విషయాన్ని చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు హీరోయిన్ గా ప్రస్తుతం ఓ వెలుగు వెలుగుతున్న వారు కొంతమంది ధృవీకరించడం మనకు తెలిసిందే. కచ్చితంగా ఇండస్ట్రీలో వెండితెరపై కనబడాలంటే ముందుగా నిర్మాతలకు పరుపుపై నగ్నంగా వాళ్ల కళ్ళకు కనబడాలని వాళ్ళ కోరిక తీర్చాలని చాలామంది స్టార్ హీరోయిన్స్ గతంలో వ్యాఖ్యలు చేయడం మనకందరికీ తెలిసిందే. ఇటువంటి కాస్టింగ్ కౌచ్ పై బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ ఇటీవల షాకింగ్ కామెంట్ చేసింది.

 

లేడీ డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్న నందిని రాయ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ...క్యాస్టింగ్ కౌచ్ విషయంలో అమ్మాయి బట్టి అవతలవైపు మనిషి ప్రవర్తన ఉంటుందని చెప్పుకొచ్చింది. ఎవరైనా ప్రయత్నించిన సమయంలో అమ్మాయిలు నో అంటే ఆ విషయం అక్కడితో పులిస్టాప్ అయిపోతుందని తెలిపింది. ఇండస్ట్రీలో అమ్మాయిలు నో చెబితే ఎవరు ఏం చేయలేరు. బలవంత పెట్టే పరిస్థితులు ఇండస్ట్రీలో ఎక్కడా కూడా ఉండవు అని తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా తెలిపింది.

 

క్యాస్టింగ్ కౌచ్ అనేది పూర్తిగా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినదిగా అందరూ అనుకుంటున్నారు కానీ అసలు విషయం ఏమిటంటే ఇటువంటి కాస్టింగ్ కౌచ్ అన్ని రంగాలలో ప్రస్తుతం విస్తరించి ఉందని తెలిపింది. అంతేకాకుండా తనకు తెలిసిన ఐటి ఫ్రెండ్స్ అనుభవించిన బాధల కంటే ఈ క్యాస్టింగ్ కౌచ్ విషయంలో సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యలు పెద్ద ఏమీ కాదని తెలిపింది. అన్ని రంగాలలో అమ్మాయిలను వాడుకునే క్రూరమృగాలు ఉన్నాయని కానీ ఆ టైంలో అమ్మాయి కమిట్మెంట్ బట్టి రియాక్షన్ ఉంటుందని నందిని రాయ్ చాలా పర్ఫెక్ట్ గా చెప్పింది. సోషల్ మీడియాలో ఈమె చేసిన వ్యాఖ్యలకు చాలా మంది నెటిజన్లు సపోర్ట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: