విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఎంత విలక్షణంగా నటిస్తాడో బయట కూడా అంతే విభిన్నంగా ప్రవరిస్తుంటాడు. సామాజిక‌ సాంస్కృతిక స్పృహ క‌లిగిన ఆయ‌న ఏం చేసినా ప్రత్యేక‌త ఉంటుంది. ప్రజా సేవ చేయడానికి ఎప్పుడు ముందుడే ప్రకాష్ రాజ్ తనకు నచ్చని విషయాలను నిర్మొహమాటంగా ఖండిస్తుంటాడు. అది దేశ ప్రధాని నరేంద్ర మోడీ అయినా సరే ప్రశ్నించకుండా వదిలిపెట్టడు. దేశానికి ముప్పు వాటిల్లుతుంది అని ఆయనకు అనిపిస్తే వెంటనే స్పందిస్తాడు. అందుకే ఆయనకు బెదిరింపులు కూడా ఎక్కువే వస్తుంటాయి. అయినా సరే వాటిని లెక్కచేయకుండా తనదైన పంధాలో వెళ్తుంటారు ప్రకాష్ రాజ్. దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన ఇబ్బందులు పడిన వలస కార్మికుల కోసం తనవంతు సాయాన్ని ప్రకాష్‌ రాజ్‌ అందించారు. ప్రకాష్‌ రాజ్‌ ఫౌండేషన్‌ ద్వారా అనేక మంది వలస కూలీలకు తన వ్యవసాయ క్షేత్రంలో ఆశ్రయం అందించి వారి జీవితాలకు భరోసా కలిగించాడు. 

 

కాగా ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఒక డాక్యూమెంటరీకి వాయిస్ ఓవర్ ఇవ్వాబోతున్నాడు. కర్ణాటక రాష్ట్రంలోని వైల్డ్ లైఫ్ మరియు నేచర్ పై ప్రముఖ వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ టెలివిజన్ ఛానల్ డిస్కవరీ ఓ డాక్యూమెంటరీ చేసింది. ఈ ఎపిసోడ్స్ తెలుగు మరియు తమిళంలోకి కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ రెండు భాషలకు వాయిస్ ఓవర్ ప్రకాష్ రాజ్ చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ప్రకాష్ రాజ్ ఆ అవకాశం దక్కినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఐతే ప్రకాష్ రాజ్ ట్వీట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. కర్ణాటక వైల్డ్ లైఫ్ ఎపిసోడ్స్ కి ప్రకాష్ రాజ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ కోసం ఎదురుచూస్తున్నాను అని ఆసక్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. చిత్ర పరిశ్రమలో మహేష్ - ప్రకాష్ ఫ్రెండ్ షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు ఇంటర్వ్యూలలో వీరిద్దరూ ఒకరికొకరు తమ మధ్య సాన్నిహిత్యాన్ని చెప్తూనే వస్తున్నారు. మహేష్ మొదటి సినిమా 'రాజకుమారుడు' నుండి ఈ ఏడాది వచ్చిన 'సరిలేరు నీకెవ్వరూ' వరకు ఒకటి రెండు సినిమాలు మినహా ప్రతి సినిమాలో ప్రకాష్ రాజ్ యాక్ట్ చేసాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: