కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఇండస్ట్రీల్లో చలన చిత్ర పరిశ్రమ కూడా ఒకటి. టాలీవుడ్ మొదలుకుని బాలీవుడ్, కోలీవుడ్ హాలీవుడ్ వరకూ ప్రతీ సినిమా పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. థియేటర్లు మూతబడి, షూటింగులు నిలిచిపోయి, మళ్ళీ ఎప్పుడు తెరుచుకుంటాయోఒ అర్థం కాక అయోమయంలో ఉంది. కరోనా ఉధృతి రోజు రోజుకీ పెరిగిపోతుండడంతో చిన్న సినిమాలు ఓటీటీ లో విడుదల అవుతున్నాయి.

 

అయితే అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా కూడా ఓటీటీ లో రిలీజ్ కానుందని వార్తలు వచ్చాయి. అన్నీ సవ్యంగా జరిగితే ఈ సినిమా ఎప్పుడో రిలీజై ఉండేది. కానీ కరోనా మహమ్మారి వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడింది. దాంతో ఓటీటీలో రిలీజ్ అవుతుందంటూ రోజూ వార్తలు వచ్చాయి. నిర్మాత కోనవెంకట్ ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశమే లేదు అని ఎమోషనల్ గా ట్వీట్ చేసినా కూడా ఈ పుకార్లు ఆగలేదు.

 

అయితే తాజాగా ఇలాంటి పుకార్లకి తెరపడిందని అర్థం చేసుకోవచ్చు. నిశ్శబ్దం సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రానికి యు/ఎ సెన్సార్ సర్టిఫికేట్ లభించింది. నాలుగవ విడత లాక్డౌన్ లో భాగంగా వ్యాపార సంస్థలకి మినహాయింపులు ఇచ్చిన నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో థియేటర్లు కూడా తెరుచుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదీగాక మల్టీప్లెక్స్ ఓనర్లు థియేటర్లో పాటించే జాగ్రత్తల లిస్ట్ ని ప్రభుత్వానికి అప్పగించారు కూడా.

 

దాంతో థియేటర్లు ఓపెన్ అవుతాయని నమ్ముతున్నారు. అందువల్లే నిశ్శబ్దం చిత్రబృందం సెన్సార్ కి వెళ్ళిందని అంటున్నారు. తెలంగాణలో మరికొద్ది రోజుల్లో షూటింగులకి అనుమతి ఇవ్వనున్న ప్రభుత్వం థియేటర్ల గురించి కూడా ఆలోచిస్తుందట. సో వీటన్నింటినీ గమనిస్తుంటే థియేటర్లు తెరుచుకునే రోజు దగ్గర్లోనే ఉందని అర్థం అవుతుంది. థియేటర్లు తెరుచుకోగానే రిలీజ్ అయ్యే మొదటి చిత్రం నిశ్శబ్దం అవుతుందేమో అని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: