తెలుగు సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్. చేసినవి తక్కువ సినిమాలే అయినా తనకో స్టైల్, తన సినిమాల మీద ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నాడు. 'వెళ్లిపోమాకే' చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రంతో క్రేజ్ ఏర్పరచుకున్నాడు. ఈ హీరోకి 'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్ నుమా దాస్' 'హిట్'.. సినిమాలు మంచి విజయాలు తెచ్చిపెట్టాయి. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్తూ తంటాలను కొని తెచ్చుకోవడంలో విశ్వక్ సేన్ సిద్ధహస్తుడు. ఫలక్ నామా దాస్ మరియు హిట్ సినిమాలు సక్సెస్ అవడంతో విశ్వక్ సేన్ మార్కెట్ బాగా పెరిగింది.

 

ఈ నేప‌థ్యంలో ఆచితూచి క‌థ‌ల‌ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం విశ్వక్ 'పాగల్' అనే మూవీలో నటిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ మూవీకి నరేష్ కుప్పిలి అనే డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా మన దేశంలోని కార్మికులు ఎందుకు వలస వెళ్తున్నారు.. అక్కడ వారు ఎదుర్కొనే సమస్యల ఇతివృత్తంతో వేణు దర్శకత్వం వహిస్తున్న ఒక సినిమాలో విశ్వక్ నటిస్తున్నాడు. కరోనా నేపథ్యాన్ని ఈ చిత్రంలో టచ్ చేయబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది.

 

కాగా లాక్ డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా షూటింగ్స్ కి బ్రేక్ పడింది. దీనితో ఎప్పుడూ బిజీగా ఉండే స్టార్స్ కి ఏమి తోయడం లేదు. ఇప్పుడు విశ్వక్ సేన్ కూడా సినిమా షూటింగ్స్ లేకపోవడంతో బోర్ గా ఫీల్ అవుతున్నట్లున్నాడు. ఈ నేపథ్యంలో తన సినిమాకు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో సోషల్ మీడియాలో పంచుకున్నారు విశ్వక్. తన గత చిత్రం 'ఫలక్ నుమా దాస్' మూవీలో ఓ సాంగ్ షూటింగ్ సమయంలో తీసిన ఆ వీడియో క్లిప్ విశ్వక్ షేర్ చేసారు. ''సినిమా సెట్స్ ని మిస్ అవుతున్నానని.. వెయిటింగ్ తో వర్క్'' అని పోస్ట్ చేసారు. ఇంతకముందు రామ్ చరణ్ కూడా సెట్స్ ని మిస్ అవుతున్నానని షూటింగ్ జ్ఞాపకాలను నెమరు వేసుకున్న సంగతి తెలిసిందే. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Miss being on #movieset . Waiting to work 🎥

A post shared by Vishwak Sen (@vishwaksens) on

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: