తెలుగు బుల్లితెరపై రికార్డు టీఆర్పీ రేటింగ్ క్రియేట్ చేసిన షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ అని చెప్పవచ్చు. ఒక్క తెలుగులోనే కాదు బిగ్ బాస్ ఎక్కడ ప్రసారమైన అక్కడ టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లో ఉంటుంది. అందుకే బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడానికి సెలెబ్రిటీలు ఎంతో ఉత్సాహపడుతుంటారు. ఇప్పటి వరకూ తెలుగులో మూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ నాలుగవ సీజన్ కి రెడీ అవుతోంది. అయితే ఈ సీజన్ ఉంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

కరోనా కారణంగా అటు సినిమా షూటింగులతో పాటు టెలివిజన్ షూటింగులు కూడా నిలిచిపోయాయి.దాంతో బిగ్ బాస్ ప్రసారం అయ్యేది అనుమానమే అన్న సందేహం వ్యక్తమైంది. అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో షూటింగుల విషయమై చర్చించిన తర్వాత ఒక హోప్ కలిగింది. జూన్ మొదటి వారం నుండి షూటింగులకి అనుమతి లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దాంతో బిగ్ బాస్ బృందం తన పని మొదలు పెట్టింది.

 

ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి కంటెస్టెంట్ల కోసం వెతుకుతోందని అంటున్నారు. అయితే ఆశ్చర్యంగా బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడానికి సెలెబ్రిటీలు ఆసక్తిగా లేరని సమాచారం. బిగ్ బాస్ ద్వారా ఎంతో పాపులారిటీ వస్తుందని తెలిసినా కూడా అటువైపు ముగ్గు చూపట్లేదట. అయితే అలా ఇంట్రెస్ట్ చూపకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముందుగా కరోనా భయం వారిని పార్టిసిపేట్ చేయనివ్వట్లేదట. అసలే హైదరాబాద్ లో రోజు రోజుకీ కరోనా ఉధృతి పెరుగుతూనే ఉంది.

 


దాంతో ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళడం ఇష్టంలేక ఇంట్రెస్ట్ చూపించడం లేదట. ఈ మేరకు బిగ్ బాస్ టీం తన ప్లాన్స్ ని మార్చుకోవాలని చూస్తుందట. అంటే బిగ్ బాస్ కి వచ్చేవాళ్లకి కరోనా టెస్ట్ చేయించిన తర్వాతే తీసుకొచ్చే అవకాశం ఉంది. అదీగాక అక్కడి పనివారికి కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వీటన్నింటినీ పాటిస్తేనే బిగ్ బాస్ హౌస్ కి రావడానికి సెలెబ్రిటీలు వచ్చే అవకాశం ఉంది. చూడలి మరి బిగ్ బాస్ టీమ్ ఏం చేయనుందో..!

మరింత సమాచారం తెలుసుకోండి: