భారతీయ పరిశ్రమలో అత్యంత ప్రతిభా గల నటుడిగా పేరు పొందిన నందమూరి తారక రామారావు 400కు పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించారు. తనకు ఏ పాత్ర అయినా పర్ఫెక్ట్ గా సరిపోవడమనేది దేవుడు ప్రసాదించిన బహుమతి అని చెప్పుకోవచ్చు. తన అత్యద్భుతమైన నటనకు గాను నటసార్వభౌముడు విశ్వవిఖ్యాత అనే బిరుదులు సంపాదించుకున్నాడు. అగ్గి రాముడు, తోట రాముడు, డ్రైవర్ రాముడు, వేటగాడు సర్దార్ పాపారాయుడు, పిడుగు రాముడు అడవి రాముడు, సాహసవంతుడు, సూపర్ మాన్ లాంటి ఎన్నో క్యారెక్టర్ లో ఎంత సహజంగా నటించిన నందమూరి తారక రామారావు కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎన్టీఆర్ మొట్టమొదటిగా మద్రాసులో బాగా పేరు సంపాదించారు. ఆ తర్వాత హైదరాబాదు నగరానికి తరలి వచ్చి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఎదురులేని నటుడిగా ఎదిగాడు. మొదటిలో పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలు తీసిన తారక రామారావు ఆ తర్వాత ఆ దేశ భక్తి గురించి ఎన్నో సినిమాలను తెరకెక్కించాడు. 

 


కొన్నేళ్ళ తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి 1982 మార్చి 29 తెలుగుదేశం అనే పేరుతో ఒక పార్టీ స్థాపించి రాజకీయాల్లో అరంగేట్రం చేసి ప్రజలకు సేవలు చేయాలనుకున్నారు. తాను పార్టీ స్థాపించిన కేవలం 8 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి అతి తక్కువ కాలంలో సీఎం అయిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు ఎన్టీఆర్. భారతదేశ స్థానాన్ని దఫాల వారీగా ఏడు సంవత్సరాల పాటు పరిపాలించిన ఎన్టీఆర్ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అప్పటివరకు వెండితెరపై అందచందాలతో నటనా ప్రతిభతో అలరించిన ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందిని తన అభిమానులను చేసుకున్నాడు. ఆ అభిమానమే తనని రాజకీయరంగంలో నిలబెట్టిందని చాలా మంది చెబుతుంటారు. 

 


ముఖ్యమంత్రిగా ఎంపిక కాబడిన తర్వాత ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లి అందరి కష్టాలను తెలుసుకున్నారు. తమ కష్టాలను తీరుస్తానని హామీ ఇచ్చి నెరవేర్చి అందరి ప్రశంసలను దక్కించుకున్నారు. తన హయాంలో ఏ వర్గ ప్రజలకు అన్యాయం జరగకూడదని తాను అనుకునేవారు. ఎన్టీఆర్ రాక ముందు కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాల్లో ఎదురు లేని రాజకీయ పార్టీగా కొనసాగింది కానీ తారక రామారావు చరిత్ర తేజస్సు ముందు కాంగ్రెస్ పార్టీ చతికిలబడి పోయింది. కేవలం ఆరు నెలల్లోనే తాను ప్రచారం చేసి ప్రజలను తన వాక్చాతుర్యంతో బాగా ఆకట్టుకునే ఎన్నికలలో ఘన విజయం సాధించారు. పేదవారికి కేజీ బియ్యం కేవలం రెండు రూపాయలకే ఇచ్చే స్కీం ని ప్రవేశ పెట్టారు. రైతులకు రోజుల్లో ఏడు గంటల పాటు ఉచిత కరెంట్ ని ఇచ్చారు. 

 

మహిళా సాధికారతే లక్ష్యంగా వంటింటికే పరిమితమైన మహిళా శక్తిని వెలికి తీసి మెరుగులు దిద్దిన మేరునగ ధీరుడతడుగా రామారావు ఆడవారి కి మిక్కిలి ఇష్టుడు అయ్యారు. దేవుని గుళ్ళ లో ఎవరైనా పూజారులు కావచ్చని చెప్పిన తారక్ రామారావు... పటేల్ పట్వారీ సిస్టం ని రూపుమాపారు. మద్యం అమ్మకాలను కూడా బ్యాన్ చేసి తెలుగు మహిళలకు ఎంతో మేలు చేశారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కూడా మొట్టమొదటిగా ఎన్టీఆరే తీసుకువచ్చారు. నా జీవితాంతం తిరుమల ద్వారా ప్రజలను ఎంటర్ టైన్ చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత కూడా రాజకీయాల్లో అరంగేట్రం చేసి ప్రజలకు ఎంతో సేవ చేసే అందరికీ ప్రియమైన వ్యక్తి గా మారిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: