నటసార్వభౌమడు, విశ్వవిఖ్యాత సీనియర్ ఎన్టీఆర్ నట ప్రస్థానం ఎలా కొనసాగిందో ఈ ఆర్టికల్ ద్వారా మనం తెలుసుకుందాం. ఎన్టీరామారావు మొట్టమొదటిగా పల్లెటూరి సినిమాలో నటించి వెయ్యి నూటపదహార్ల పారితోషికం గా తీసుకున్నాడు. ఆ తర్వాత 1949లో మనదేశం అనే సినిమాలో పోలీసు ఇన్స్పెక్టర్ గా నటించాడు. ఎల్.వి.ప్రసాద్ చిత్రమైన షావుకారు కూడా అదే సంవత్సరంలో విడుదల అయ్యింది. రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత సీనియర్ ఎన్టీఆర్ తన ఇంటిని మద్రాసుకు మకాం మార్చారు. మద్రాసులో రెంట్ ఇంటిలో అద్దెకు ఉన్న ఎన్టీరామారావు అక్కడ ఉండటం నేర్చుకోండి ఇంకా మంచి సినిమా అవకాశాలు దక్కించుకున్నాడు. 

 


1951 వ సంవత్సరం లో కె.వి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన పాతాళ భైరవి సినిమాలో కథానాయకుడి పాత్రలో నటించిన నందమూరి తారక రామారావు క్రేజ్ భారతదేశవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. తదనంతరం తాను బి ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మల్లీశ్వరి సినిమాలో నటించి అద్భుతమైన నటుడిగా పేరు పొందాడు. చంద్రహారం సినిమాలో అతని నటనకు గాను విమర్శకులు సైతం చప్పట్లు కొట్టారు అంటే అతిశయోక్తి కాదు. సినిమాలన్నీ విజయ ప్రొడక్షన్ లో తెరకెక్కినవే. 

 


ఈ సినిమాలలో నటించినందుకు గానూ నెలకు 500 నుండి ఐదు వేల రూపాయల వరకు పారితోషికం తీసుకునే వారు ఎన్టీఆర్. అప్పట్లో పాతాళభైరవి సినిమా అది కేంద్రాలలో వంద రోజుల పైగా ఆడి ఎన్నో లక్షల రూపాయలను డబ్బులను గడించి విజయ వాహినీ సంస్థకు సంపాదించిపెట్టింది. 1959వ సంవత్సరంలో భూకైలాస్ చిత్రంలో రావణ బ్రహ్మ పాత్రలో రావణ బ్రహ్మ అంటే నిజంగా ఇలాగే ఉంటారా అన్నట్టు నటించి తన కీర్తిని బాగా పెంచుకున్నాడు ఎన్టీఆర్. 1972వ సంవత్సరం నుండి ఎన్టీ రామారావు పారితోషికం లక్షల్లోకి వెళ్ళిపోయింది. దాన వీర శూర కర్ణ సినిమా లో తాను మూడు పాత్రలలో నటిస్తూ దర్శకత్వం కూడా వహించారు అందరి చేత వావ్ అనిపించాడు. 1990లో విడుదలైన బ్రహ్మర్షి విశ్వామిత్ర అతని చివరి చిత్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: