ఎన్టీ రామారావు తెలుగు పరిశ్రమలో గొప్ప నటుడిగా పేరు పొంది ముఖ్యమంత్రి పదవిని అధిరోహించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఏ క్యారెక్టర్ లో అయినా బ్రహ్మాండంగా ఒదిగిపోగల టాలెంట్ ఉన్న ఎన్టీ రామారావు కి కృష్ణుడి పాత్ర ఇచ్చేందుకు కొంతమంది నిర్మాతలు ఒప్పుకోలేదట. 1957వ సంవత్సరంలో మాయాబజార్ చిత్రాన్ని రూపొందిస్తున్న టైంలో గొప్ప దర్శకుడు కె.వి.రెడ్డి నిర్మాతలతో మాట్లాడి ఎన్టీ రామారావు ని కృష్ణుడి పాత్రలో నటించిన చేయాలని కోరారు. కానీ మాయాబజార్ సినిమాకి నిర్మాత అయిన బి నాగిరెడ్డి, ఎ. చక్రపాణి ఎన్టీరామారావు కృష్ణుడు పాత్ర ఇచ్చేందుకు నిరాకరించారు. అప్పటికే ఎన్టీ రామారావు దాదాపు ఇరవై నాలుగు సినిమాలలో నటించి తక్కువ పాపులారిటీ తోనే సతమతమవుతున్నారు. 

 


నిజం చెప్పాలంటే డైరెక్టర్ కె వి రెడ్డి ఎన్టీ రామారావు ని పాతాళభైరవి సినిమాలో హీరోగా ఎంపిక చేసి తన సినీ జీవితాన్ని మార్చేశారు అందుకే ఎన్టీ రామారావు కి డైరెక్టర్ కె వి రెడ్డి అంటే చాలా ఇష్టం. మాయాబజార్ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుని పాత్రలో నటించగా... ఆ సినిమా అప్పట్లో వంద రోజులకు పైగా 24 థియేటర్లలో ఆడి రికార్డులు సృష్టించింది. కృష్ణుని పాత్రలో ఎలా నటించాలో కె.వి.రెడ్డి ఎన్టీ రామారావు అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పేవారు. ఎన్టీఆర్ ఛాతి పెద్దగా ఉండటంతో తన ప్రసంగాన్ని కాస్త దగ్గరికి చేసి కృష్ణుని రూపం లో వచ్చేలా టిప్స్ చెప్పేవారు కె.వి.రెడ్డి. ఎన్టీఆర్ కూడా వీలుచిక్కినప్పుడల్లా మహాభారతం, భగవద్గీత, ఇతర పురాణ గ్రంధాలు చదువుతూ కృష్ణుని గురించి తెలుసుకొని మంచిగా నటించాలని కృషి చేశారు. 

 


ఇకపోతే ఎన్టీ రామారావు నటుడిగా, రచయితగా, దర్శకుడిగా నిర్మాతగా తెలుగు ఇండస్ట్రీలో కొనసాగి ఆ తర్వాత రాజకీయ రంగంలో అరంగేట్రం చేసి 12 సంవత్సరాల కాలంలో మూడుసార్లు ముఖ్యమంత్రి పదవిని అధిరోహించి ప్రజలకు ఎంతగానో సేవచేసి... 1996 వ సంవత్సరంలో హైదరాబాద్ లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. చనిపోయినప్పుడు తన వయసు 72 సంవత్సరాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: