ప్రతి తెలుగువాడు అన్నగారు అని ప్రేమతో పిలవబడే నట సార్వభౌమ, నందమూరి తారక రామారావు గారి 97 వ జయంతి రేపు అనగా మే 28వ తేదీ సందర్భంగా... అతని బాల్యం గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. కృష్ణా జిల్లాలో ఉన్న పుట్టపాడు గ్రామంలో కాట్రగడ్డ సూరయ్య లక్ష్మిదేవమ్మ లకు చంద్రమ్మ పుట్టిన 12 సంవత్సరాల తర్వాత రెండవ కుమార్తె గా వెంకటరమమ్మా పుట్టారు. బ్రతుకుతెరువు కోసం వీరు పుట్ట పాడు గ్రామం నుండి కొమరవోలు కి షిఫ్ట్ అయ్యారు. సూరయ్య పెద్ద కుమార్తె కు పెళ్లి సంబంధాలు చూసేందుకు అనేక ఊళ్లు తిరుగుతూ తిరుగుతూ చివరికి నిమ్మకూరుకు వెళ్లారు. అయితే అక్కడ అదే సమయంలో పాండవోద్యమం అనే నాటకం కొనసాగుతుంది. ఆ నాటకంలో భీముని పాత్ర వేసే నటుడు అతనికి బాగా నచ్చాడు. 

 


అనంతరం అతని గురించి ఆరా తీసి భీముడి పాత్రలో నటించిన వ్యక్తి పేరు రామయ్య అని తెలుసుకున్నాడు. ఆ వ్యక్తిని సోకు రామయ్య అని అప్పట్లో జనాలు పిలిచేవారు. సోకు రామయ్య అనే వ్యక్తి నిమ్మకూరులో నందమూరి అక్కయ్య అనే ఆమెకు పెద్ద కొడుకు. అతనికి ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు వారి పేర్లు సుబ్బయ్య, నాగయ్య. నందమూరి అక్కయ్య కుమారులు చిన్నప్పుడే ఆమె భర్త చనిపోయారు. దాంతో రామయ్య ఇంటి పెద్ద గా మారాడు. రామయ్య ఐరన్ చేసిన వస్త్రాలు ధరించి సోకులు చేసే వాడు. అలాగే ఒక భట్రాజు ని తన వెంట ఒకటి కంటే ఎక్కువ పోంగిడించుకునే వాడు అలాగే వీలుచిక్కినప్పుడల్లా నాటకాలలో భీముడి పాత్రలో నటించే వాడు. 

 


అతడిని చూసిన సూరయ్య తన పెద్ద కుమార్తె అయిన చంద్రమ్మ ను ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. దానికి రామయ్య కూడా అంగీకరించి చంద్రమ్మ ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయితే చేసుకున్నాడు కానీ చంద్రమ్మ తో మాత్రం తాను అంతగా సమయాన్ని గడిపేవాడు కాదు. పొద్దస్తమానం నాటకాలు అంటే బయట తిరుగుతుంటే ఇది తెలుసుకున్న సూరయ్య నిమ్మకూరు కి వచ్చి తన కూతురు అల్లుడు ఇంట్లో ఉండసాగాడు. ఎన్నో ఏళ్లు గడుస్తున్నా చంద్రమ్మ రామయ్య దంపతులకు పిల్లలు పుట్టలేదు. దాంతో అదే గ్రామంలో నందమూరి రామస్వామి మహాలక్ష్మమ్మ అనే మరో కుటుంబం ఉండేది. అయితే వీరికి రెండవ కొడుకు అయినా లక్ష్మయ్య చాలా మంచివాడు. తన పని తాను చేసుకుపోయే వాడు. అందుకే అతనికి తన రెండవ కుమార్తె అయిన వెంకట రామమ్మ ని ఇచ్చి పెళ్ళి చేశాడు సూరయ్య.

 


వెంకట రామమ్మ, లక్ష్మయ్య దంపతులకు 1923 మే 28న వైశాఖ మాసం, స్వాతి నక్షత్రం తులా లగ్నమందు సోమవారం రోజు సాయంత్రం 4:32 నిమిషాలకు నందమూరి తారకరామారావు జన్మించారు. సోకు రామయ్య చంద్రమ్మ లకు పిల్లలు లేకపోవడంతో నందమూరి తారక రామారావు ని చాలా అపురూపంగా చూసుకునే వారు. సోకు రామయ్య ఎన్టీఆర్ కు ఎన్నో తెలివితేటలను నేర్పించారు. ఆ తెలివితేటల వలన ఎన్టీఆర్ చదువుల్లో బాగా రాణించే వారు.

మరింత సమాచారం తెలుసుకోండి: