ఎన్టీరామారావు విద్యాభ్యాసం చాలా కష్టతరంగా కొనసాగింది. తాము ఉంటున్న ఊర్లో పాఠశాలలు లేకపోవడంతో వల్లూరి సుబ్బారావు వద్ద విద్యను అభ్యసించేవారు ఎన్టీఆర్. ఆ తర్వాత మునిసిపల పాఠశాలలో ఐదో తరగతి వరకు విద్యను అభ్యసించాడు. విజయవాడలో మున్సిపల్ హైస్కూల్ లో ఆరవ తరగతి రెండు రూపాయల యాభై పైసల ఫీజు కట్టి ఎన్టీ రామారావు ని తన పెద్ద నాన్న సోకు రామయ్య చదివించారు.

 


ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య ఎన్టీఆర్ చదువు కోసం అని నెలకు యాభై రూపాయలు పంపించేవారు. అలాగే తాను అప్పు చేసి పొలం కొనగా ధాన్యం రేటు పడిపోగా... చేసిన అప్పులు తీర్చేందుకు కొన్న పొలం తో పాటు ఉన్న పొలాన్ని కూడా అమ్ముకున్నాడు. ఈ విషయం కాస్త ఆర్ రామయ్య ఎన్టీఆర్ లతో తెలియడంతో... ఎన్టీఆర్ ని తానే చదివించాలని నిశ్చయించుకున్న రామయ్య కండక్టర్ ఉద్యోగాన్ని సంపాదించాడు. కానీ డ్యూటీ లో భాగంగా తన కాలు పెరిగిపోవడంతో లక్ష్మయ్య తనకు విశ్రాంతి తీసుకోమని చెప్పి విజయవాడ కి వచ్చే పాల వ్యాపారం పెట్టాడు. తన నాన్న పాల వ్యాపారానికి ఎన్టీఆర్ సహాయంచేసేవాడు ఉదయం రెండు గంటల సమయం లో నిద్రలేచి గేదెలకు గడ్డి వేసి పాలు ఇస్తే ఇంటికి వెళ్ళి పాలు అందించేవాడు. వీలు చిక్కినప్పుడల్లా పుస్తకపఠనం చేసేవాడు. 

 


ఆ క్రమంలోనే విజయవాడలో ఎక్కువమంది రౌడీలు ఉంటారని తెలిసి జిమ్ లో చేరిన అతనికి స్వాతంత్రం గురించి అవగాహన కలిగింది. అప్పుడే స్వాతంత్ర్య ఉద్యమాలలో పాల్గొన్నాడు. పదవ తరగతి పూర్తి చేసిన అనంతరం విజయవాడలోనే ఎస్.ఆర్.ఆర్ కాలేజీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుండి నాటకాలు వేయడం ప్రారంభించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నాటకాల తో పాటు చదువులో కూడా ఎప్పుడూ ముందంజలో ఉండేవాడు ఎన్టీఆర్. అనవసరమైన పరీక్షలో పాస్ అయ్యి ఉద్యోగాన్ని సంపాదించాడు. సినిమాల్లో అవకాశాలు రావడంతో ఉద్యోగానికి రిజైన్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: