సినీ ఇండస్ట్రీలో స్వయంకృషితో పైకి వచ్చిన వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు.  ప్రస్తుతం వారసుల జోష్ నడుస్తుంది.  ఈ నేపథ్యంలో ఒక చిన్న కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన లారెన్స్ తర్వాత స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేసి తన టాలెంట్ ఏంటో చూపించాడు.. ఆ తర్వాత నటుడిగా తన సత్తా చాటాడు. ఇప్పుడు దర్శకుడిగా తన రేంజ్ ఏంటో వరుస హిట్స్ తో చూపించాడు.  ముని సీక్వెల్ గా ఇప్పటి వరకు కాంచన, కాంచన2,కాంచన 3 చిత్రాలు తెరకెక్కించాడు. కరోనా వైరస్ ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకుంటూ తన రెమ్యూనరేషన్ కూడా వారికే ఖర్చుపెట్టారు.  అయితే లారెన్స్ నటుడిగానే కాకుండా మంచి సామాజిక సేవా దృక్పదం కలిగిన వ్యక్తి. 

 

 

ఈయన ట్రస్ట్ ద్వారా ఎంతో మంది అనాథ పిల్లలు, వృద్దులను చేరదీసి వారిని పోషిస్తున్నారు. తాజాగా లారెన్స్ నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్ట్ హోంలో కరోనా మహమ్మారి కలకలం రేపింది. చెన్నైలోని అశోక్ నగర్ లో ట్రస్ట్ లో ఉన్నవారిలో 20 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. గత కొన్ని రోజులుగా తమిళనాట కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోయింది.  ఇక చెన్నైలో దీని ప్రభావం మరింతగా ఉందన్న విషయం తెలిసిందే. ఈ నేథ్యంలో  కరోనా నిరోధక చర్యల్లో భాగంగా చెన్నై కార్పొరేషన్ సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించారు.

 

ఈ క్రమంలో లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ లో ఉన్న పలువురిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వారి నమూనాలు సేకరించి పరీక్షించగా, 20 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ వెంటనే వారందరినీ ఆసుపత్రికి తరలించామని వెల్లడించిన గ్రేటర్ చెన్నై అధికారులు, ట్రస్ట్ గెస్ట్ హౌస్ ను మూసివేశారు. ఇక కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో ఇకముందు మరింత జాగ్రత్తలు తీసుకుంటామని రాఘవ లారెన్స్ తెలిపారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: