సౌత్ ఇండియాలో టాప్ డైరక్టర్ల లిస్టులో ప్రస్తుతం ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు రాజమౌళి. ఆయన ఎవరితో సినిమా చేస్తారా.. అనేకంటే తనతో సినిమా చేస్తే బాగుండును అనుకోని హీరో లేరంటే అతిశయోక్తి కాదేమో. ప్రస్తుతం ఆయన క్రేజ్ అలా ఉంది. అయితే.. ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్ తర్వాత మహేశ్ తో చేసే ప్రాజెక్టు గురించి రాజమౌళి ఇంకా ఏ విషయం కూడా రివీల్ చేయలేదు. కథ విషయంలో కానీ, మహేశ్ పాత్ర గురించి కానీ ఎటువంటి క్లారిటీ లేదు. కానీ.. ఉత్సాహం ఆపుకోలేని మహేశ్ అభిమానులు తమ హీరో ఇలా ఉండాలని ప్రిపేర్ అయిపోతున్నారు.

 

 

దీంతో మహేశ్ లుక్ ఇలా ఉండాలని ఫ్యాన్ మేడ్ పోస్టర్లు తయారు చేసేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. ఏకంగా మహేశ్ తో రాజమౌళి చేసే సినిమా రామాయణం అని ప్రకటించేస్తున్నారు. మహేశ్ ను రాముడిగా మార్ఫింగ్ ఫొటో చేసి ఫ్యాన్ మేడ్ పోస్టర్ గా పోస్ట్ చేస్తున్నారు. రాముడిగా మహేశ్ పొడవైన జుట్టుతో ఉన్నాడు. చేతిలో బాణం, మంచి దేహధారుడ్యంతో ఉన్న ఫొటోను వైరల్ చేసేస్తున్నారు. పోస్టర్ పై కూడా టైటిల్ ను ‘రామాయణం’.. దర్శకుడు రాజమౌళి.. రాముడిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు.. అని కూడా ప్రింట్ వేసేశారు.

IHG

 

ప్రస్తుతం ఈ పిక్ విపరీతంగా వైరల్ అవుతోంది. నిజానికి రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్టుగా మహాభారతం గురించి చెప్పాడు కానీ.. రామాయణం అని ఎప్పుడూ చెప్పలేదు. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ చేస్తున్న రాజమౌళి తన తర్వాతి ప్రాజెక్టు వివరాలను చెప్పేశారు. మహేశ్ తో సినిమా చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి మహేశ్ అభిమానుల్లో ఆనందం ఉరకలెత్తుతోంది. మరి ఫ్యాన్స్ అత్యుత్సాహం గురించి చెప్పేదేముంది. క్రియేటివిటీ పీక్స్ కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: