ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఫోటోలు తప్పుడు ప్రచారం కొనసాగుతోంది. అసలు అలాంటి యాప్స్ ఎందుకనో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి మార్కెటింగ్ చేసుకుంటావో తెలియదు. దానివల్ల ప్రముఖుల యొక్క పరువు పోవడమే కాకుండా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి వాటి వలన వారి పర్సనల్ జీవితాలు కూడా నాశనం అవుతాయి. ఇక అసలు విషయంలోకి పోతే... సెలబ్రిటీల ఫోటోలు అప్పుడప్పుడు డేటింగ్ యాప్స్ లో ఈ మధ్యకాలంలో కనిపిస్తున్నాయి. సెలబ్రిటీల అనుమతులు లేకుండానే చాలాసార్లు డేటింగ్ యాప్స్ సెలబ్రిటీల ఫోటోలను వాడిన దాఖలాలు అనేకంగా ఉన్నాయి. 

 

ఇక ఈ విషయంలో తాజాగా తెలుగు యాంకర్ మంజూష ఫోటోలు కూడా డేటింగ్ యాప్ లో ప్రత్యక్షమయ్యాయి. ఇకపోతే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మంజూష ఫోటోలను డేటింగ్ యాప్ లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న మంజూష తెలిసిన వెంటనే దానిపై స్పందించింది. తన ఫోటోలను ఎటువంటి అనుమతి లేకుండా ఉపయోగించడంతో పాటు తన గురించి తప్పుడు ప్రచారం చేసిన సదరు యాప్ పై చర్యలకు సిద్ధం కాబోతోంది ఆవిడ. అంతేకాకుండా ఆ అప్లికేషన్ ను తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా వాడవద్దని అది యువతను తప్పుదోవ పట్టించే విధంగా ఉందంటూ ఆమె తెలిపింది.

 

ఇకపోతే బుల్లితెరపై యాంకర్ మాత్రమే కాకుండా పలు సినిమాల్లో కూడా నటిగా మంజూష కనిపించింది. అయితే ప్రస్తుతం మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు కూడా చేస్తోంది. అటు బుల్లితెర, ఇటు వెండితెరపై ఛాన్స్ కోసం ఈ విపత్తు సమయంలో పూర్తిగా ఇంటికే పరిమితమై తన ఫిజిక్ ను కాపాడేందుకు కష్టపడుతోంది ఈ భామ. అంతేకాకుండా ఇలాంటి యాప్స్ ఉపయోగించడం వల్ల యువత చెడిపోవడం కాకుండా, అనేక ఇబ్బందులు పడాల్సిన సమయం వస్తుంది. కాబట్టి వీటికి చాలా దూరంగా ఉంటేనే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: