ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫోటోగ్రఫీ యాప్ లు ఎన్నో ఎక్కువైపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. కొంతమంది తమకు కావాల్సిన విధంగా ఫోటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఏకంగా సంచలనం సృష్టిస్తున్నారు. మొన్నటికి మొన్న ఏకంగా ఇవాంకా ట్రంప్ సైకిల్ మీద వెళుతున్నట్లుగా... ఇలా మరికొన్ని ఫోటోలను  ఎడిటింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఎంతో మంది సినీ అభిమానులు కూడా తమ అభిమాన హీరో ని ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఫోటోలను ఫోటో ఎడిటింగ్ ద్వారా మార్ఫింగ్ చేసి సరికొత్తగా ఎవరూ ఊహించని విధంగా సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఇలా హీరో లకు సంబంధించిన ఎన్నో ఫోటోలు తెర మీదికి వచ్చిన విషయం తెలిసిందే. 

 

 ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు పై అభిమాని తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు సరి కొత్తగా ఆలోచించాడు. ఏకంగా మహేష్ బాబును తాను ఎలా చూడాలనుకుంటున్నాడో అలా ఆన్లైన్ లో ఒక ఫోటో సిద్ధం చేసి పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకూ ఎప్పుడూ కనిపించనంత డిఫరెంట్ గెటప్ లో మహేష్ బాబు ఇందులో కనిపిస్తున్నాడు. రాముడి పాత్రలో ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు  మహేష్ బాబు. చేతిలో బాణం పట్టుకొని ఎంతో కూల్గా నిలబడిన రాముడిలా మహేష్ బాబు కనిపిస్తున్నాడు. 

 

 ఇక ఈ ఫోటోను ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఇది కాస్త నెట్టింట్లో  హల్ చల్ చేస్తోంది. అయితే ఎవరూ ఊహించని విధంగా మహేష్ బాబును రాముడు గెటప్ లో ఉండేలా ఒక ఫోటో మార్ఫింగ్ చేయడంతో ప్రస్తుతం ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు కూడా. ఇకపోతే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా షూటింగ్ లు అన్నీ ఆగిపోవడంతో ఇంట్లో ఉండి కుటుంబంతో సమయాన్ని గడుపుతూ ఉన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్  అనే సినిమాను తెరకెక్కిస్తున్న రాజమౌళి తన తర్వాత సినిమా మహేష్ బాబుతో ఉండబోతుంది అని చెప్పకనే పలుమార్లు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో రాజమౌళి సినిమాలో మహేష్ బాబు  పాత్ర ఎలా ఉండబోతుంది అన్నది మాత్రం ప్రస్తుతం ఊహకందని విధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: