తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు పవన్  కళ్యాణ్ . అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇన్నేళ్లకు  రాజకీయాల నుంచి మళ్లీ సినిమాల్లోకి పునరాగమనం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక ప్రస్తుతం రీ ఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలకు సైన్ చేసాడు పవన్  కళ్యాన్ . ఇప్పటికే పవన్ కళ్యాణ్ హీరోగా వఖిల్ సాబ్  అనే ఒక సినిమా  చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ దర్శకుడు క్రిష్ తో ఉండబోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. 

 

 

 మరోవైపు క్రిష్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటూ ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ మూడు సినిమాలతో పాటు మరో మలయాళ  సినిమా తెలుగు రీమేక్  కూడా చేయబోతున్నాడు అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

 

 

 డ్రైవింగ్ లైసెన్స్ అనే మలయాళ సినిమా తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటించబోతున్నారని... టాలీవుడ్ లోని ఒక స్టార్ నిర్మాత ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నారు అని టాక్  వినిపిస్తోంది. అయితే ఇందులో వాస్తవం ఎంత అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. అయితే ఇదే సినిమా గురించి మరొక టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ అంతగా ఆసక్తి చూపడం లేదు అనే టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ ఇలాంటి సినిమాలు సూట్ అవ్వవు  అని కొంతమంది సన్నిహితుల దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారట. అందుకే ఈ సినిమా తాను చేయడం లేదు అంటూ చెప్పుకొచ్చారట. మరి ఇందులో ఏది నిజమో అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: