మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన  కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతిరావు కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న ఉమాపతిరావు హైదరాబాద్ నగరంలో అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వయసు మీద పడటం వలన అనారోగ్యం కారణంగా ఆయన చనిపోయినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం దోమకొండ లో జన్మించిన కామినేని ఉమాపతిరావు ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేశారు. పేద ప్రజలకు సమాజానికి ఎన్నో సేవలు అందించారు. సమాజంలో మంచి పేరుప్రఖ్యాతులు గాంచిన కామినేని ఉమాపతి రావు మరణం తో రామ్ చరణ్ భార్య ఉపాసన తీవ్ర భావోద్వేగానికి గురైంది. కామినేని ఉమాపతిరావు ఉర్దూలో కూడా ఆయన రచనలు రాయటం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తొలి ఈవోగా పని చేశారు.

 

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో భావోద్వేగంగా ఉపాసన పోస్ట్ పెట్టారు. నిస్వార్థం, మానవత్వం, హాస్య చతురత ఉన్న ఆయ‌న ఉర్దూలో  రాసిన రచనల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు...టీటీడీ తొలి ఈవోగా పనిచేశారు. అనేక గొప్ప సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అని ఆయనకు హాస్య చతురత కూడా ఎక్కువే...మీ ఆత్మకు శాంతి చేకూరాలి తాత‌య్య’ అంటూ పోస్ట్ పెట్టారు.

 

అంతే కాకుండా అందరూ కన్నీటి ద్వారా కాకుండా చిరునవ్వుతో మా తాతయ్య పై ప్రేమ కురిపించాలంటూ స్ప‌ష్టం చేసింది. దీంతో ఉపాసన కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులు కామినేని ఉమాపతి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. ఇదే సమయంలో కామినేని ఉమాపతి రావు తో వయసు కలిగిన వాళ్ళు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మెగా కుటుంబంలో సభ్యులు కూడా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: