పూరి జగన్నాధ్ ఏ సినిమా చేసినా హీరోయిజం ఉండాల్సిందే. జులాయిగా తిరిగే పాత్ర అయినా, అఫిషియల్ బిజినెస్ మ్యాన్ పాత్ర అయినా, పోలీస్ అధికారి పాత్ర అయినా.. అందులో హీరోయిజం ఉండాల్సిందే. హీరో పాత్రను బోర్ వెల్ నుంచి నీళ్లు ఎగిసిపడేట్టు చూపించడంలో పూరి స్పెషలిస్ట్. ఇటువంటి ఓ ఫుల్ హీరోయిక్ పాత్రే గోపీచంద్ తో చేయించాడు. ఆ సినిమానే ‘గోలీమార్’. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలై నేటికి 10ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా గోపీచంద్ నటించిన ఈ సినిమా 2010 మే27న విడుదలైంది. పూరి మార్క్ డైలాగ్స్, యాక్షన్, టేకింగ్ తో ఈ సినిమా తెరకెక్కింది. భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ను తనదైన స్టైల్లో నిజంగా పోలీస్ ఎన్ కౌంటర్స్ దగ్గన నుంచి చూస్తున్న ఫీల్ తీసుకొచ్చాడు పూరి. పూరికి ఇష్టమైన గ్యాంగ్ స్టర్ కథాంశాన్న జోడించి పోలీస్ కథాంశాన్ని జోడించాడు. గన్స్ వాడకాన్ని కూడా పూరి చూపించినట్టు మరెవరూ చూపించ లేరు. పోకిరి తరహాలోనే సెకండాఫ్ లో సస్పెన్స్ రివీల్ అవుతుంది. సినిమాలో గోపీచంద్ హీరోనే అయినా పాత్ర పరంగా చాలా రఫ్ గా చూపించి ఆకట్టుకున్నాడు పూరి.

IHG

 

పూరి డైరక్షన్ లో గోపీచంద్ నటించిన మొదటి సినిమా ఇది. తన బాడీ లాంగ్వేజ్ తో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు. హీరోయిన్ గా ప్రియమణి నటించింది. తన గ్లామర్ తో, సరదా యాక్టింగ్ తో ఆకట్టుకుంది. చక్రి సంగీతంలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ కూడా ఆకట్టుకుంటుంది. ప్రియమణి తల్లిగా రోజా నటించింది. శ్రీ సాయి గణేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేశ్ ఈ సినిమాను నిర్మించాడు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: