టాలీవుడ్ లో విజయశాంతి సినిమాలు అనగానే చాలా మంచి క్రేజ్ ఉండేది. ఆమె సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు సినిమా హాల్ కి పరుగులు తీసిన రోజులు కూడా ఉన్నాయి. ఆమె సినిమా అనగానే నిర్మాతలు దర్శకులు కూడా అప్పట్లో ఒకరకంగా పొంగిపోయేవారు. ఆమెకు అతని తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆమె పని చేసిన దర్శకులు కూడా స్టార్ దర్శకులు హీరోలు కూడా స్టార్ హీరోలు కావడం తో ఆమె టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. ఆమె సినిమాలు అనగానే జనాలకు ముందు నుంచి కూడా ఒక క్రేజ్ అనేది ఏర్పడింది. 

 

ఆ విధంగా  ఆమె సినిమాలు ఒక సంచలనం సృష్టించాయి అని చెప్పవచ్చు. ఇక ఇది పక్కన పెడితే ఆమె సినిమాల్లో బిజీ అయ్యే అవకాశం ఉందని చాలా మంది భావించారు. కాని ఆమె మాత్రం ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు ఆమెకు ప్రభాస్ సినిమాలో మంచి అవకాశం వచ్చినట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఆమెకు అవకాశం ఇవ్వడానికి నాగ్ అశ్విన్ సిద్దమయ్యాడు అని సమాచారం. ఆమెకు అశ్విని దత్ తో ఉన్న మంచి సంబంధాలతో ఈ సినిమా ఆమె చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆమె వచ్చే ఏడాది ఈ సినిమాలో నటించే అవకాశం ఉంది 

 

అయితే ఆ సినిమాలో ఆమె చేసే పాత్ర ఏంటీ అనేది స్పష్టత లేదు గాని ఆమె ఒక వ్యాపారవేత్త గా నటించే అవకాశం ఉందని అది కూడా పెద్ద వ్యాపర వేత్త కాదని చిన్న వ్యాపారవేత్తగా నటిస్తుంది అని ఆమె పాత్ర సినిమాకు చాలా కీలకమని తెలుస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది. ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: