సాధారణంగా సినిమాల్లో ఒక్కసారి అగ్ర హీరోతో సినిమా చేస్తే చాలు ఇక దర్శకుడికి వచ్చే అవకాశాలఆకూ తిరుగు ఉండదు. ఎందరో హీరోలతో సినిమాలు చేయవచ్చు. కాని ఒక యువ దర్శకుడు మాత్రం ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. అగ్ర దర్శకులు అందరి తో సినిమాలు చేసినా సరే సదరు యువ దర్శకుడికి మాత్రం ఇప్పుడు అవకాశాలు రావడం చాలా కష్టంగా ఉంది. అతని పేరే బాబీ. పవన్ కళ్యాణ్ తో ఎన్టీఆర్ తో రవి తేజా తో అతను సినిమాలు చేసాడు. కాని అతన్ని పట్టించుకునే వారు ఎవరూ లేరు. 

 

అవును ఇప్పుడు అతను ఎవరి తో సినిమా చెయ్యాలో అర్ధం కాక బాగా ఇబ్బంది పడుతున్నాడు. రామ్ చరణ్ తో ఒక సినిమా చెయ్యాలని ప్రభాస్ తో ఒక సినిమా  చెయ్యాలని అతను ప్రయత్నాలు చేసినా సరే అవకాశం మాత్రం రాలేదు ఇక రవి తేజా తో సినిమా చెయ్యాలని చూసినా సరే ఆయన కూడా అవకాశం ఇవ్వలేదు అని  సమాచారం. చిరంజీవి తో లూసిఫర్ సినిమా చేయడానికి అతను ప్రయత్నాలు చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి అతను సినిమాలు చేస్తాడా లేదా లేక సినిమాల నుంచి తప్పుకుంటాడా అనేది అర్ధం కావడం లేదు. 

 

అతనికి మంచి ప్రతిభ ఉన్నా సరే సినిమాలు ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడం తో అతన్ని పక్కన పెట్టారు హీరోలు.  అందుకే అతను ఇప్పుడు సినిమాలు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం అతని కెరీర్ ఆందోళన కర పరిస్థితుల్లో ఉందని సమాచారం. అందుకే అతను ఒక్క ఛాన్స్ అంటూ ప్రయత్నాలు చేస్తున్నాడు. యాక్షన్ సినిమాలను చాలా బాగా చేస్తాడు అనే పేరు అతనికి ఉంది. కాని వాటిని తీసే విధానం సరిగా లేకపోవడం తో సినిమాలు బోర్ కొడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: