టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ త్రిష. ఆమె సినిమాలకు ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. దాదాపు అగ్ర హీరోలు అందరితో ఆమె సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు బాలకృష్ణ చిరంజీవి వంటి సీనియర్ హీరోలతో కూడా ఆమె సినిమాలు చేసింది. మహేష్ బాబు తో ఆమె చేసిన అతడు సినిమా ఆమెకు మంచి హిట్ ఇచ్చింది. ఇక  ఇప్పుడు ఆమె ఎక్కువగా తమిళంలో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ఆమెకు మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి ఆ సినిమాలు అన్నీ కూడా అగ్ర హీరోల సినిమాలే కావడం విశేషం. 

 

ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆమెకు చిరంజీవి ఒక అవకాశం ఇచ్చారని టాలీవుడ్ లో టాక్. అవును చిరంజీవి ఆమెకు పిలిచి మరీ అవకాశం ఇచ్చారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. దానికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని ఆమెకు మాత్రం ఒక అవకాశం చిరంజీవి ఇచ్చారని ఆయన తర్వాతి సినిమాలో ఆమె హీరోయిన్ గా చేస్తుంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. రామ్ చరణ్ నిర్మాణ సారధ్యంలో  వచ్చే సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది అని సమాచారం. ఇక పూరి జగన్నాథ్ తో చేసే సినిమాలో కూడా ఆమెకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. 

 

ఇక ఆమె  త్వరలోనే హైదరాబాద్ కూడా వచ్చి ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని సమాచారం. గతంలో ఆమె తో చేసిన సినిమా మంచి విజయం సాధించలేదు అని అందుకే ఆమెకు అవకాశం ఇవ్వాలని చిరంజీవి భావించారు అని టాలీవుడ్ లో ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. ఆమెకు చిరంజీవి తో ఒక మంచి సినిమా చెయ్యాలని ఎప్పటి నుంచో కోరికగా ఉందని అందుకే ఇప్పుడు ఆయన ఆమెకు అవకాశం ఇచ్చారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: