టాలీవుడ్ లో ఇప్పుడు కొందరు హీరోలు యువ దర్శకులకు అవకాశం ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిభ ఉన్న దర్శకుల కోసం రామ్ చరణ్ మహేష్ బాబు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొన్ని కారణాలతో వాళ్ళు యువ దర్శకులకు అవకాశం ఇవ్వడం అనేది సాధ్యం కాలేదు. ఈ తరుణంలో రామ్ చరణ్ ఒక ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. చెన్నై లో తనతో కలిసి చదువుకున్న ఒక వ్యక్తి  తమ్ముడికి దర్శకుడిగా అవకాశం ఇవ్వాలని రామ్ చరణ్ భావించినట్టు సమాచారం. అతనిని కథ రెడీ చేసుకోవాలని రామ్ చరణ్ చెప్పాడు అని టాలీవుడ్ లో ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. 

 

కథ రెడీ చేసుకుని తనకు చెప్తే తాను చేసినా చేయకపోయినా సరే మరో హీరోకి అయినా సరే ఇస్తా అని చెప్పాడని సమాచారం. దీనితో సదరు వ్యక్తి ఇప్పుడు సినిమా కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. కథ అంతా సిద్దంగా ఉందని రామ్ చరణ్ వినడమే ఆలస్యం అని సమాచారం. త్వరలోనే రామ్ చరణ్ ఒక పని మీద చెన్నై వెళ్ళే అవకాశం ఉందని అప్పుడు సదరు కథ ను విని ఏదోక మాట చెప్పే అవకాశం ఉందని అలాగే హైదరాబాద్ లో ఒక యువ దర్శకుడికి కూడా అతను అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. 

 

నిర్మాతగా సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న రామ్ చరణ్ ఇప్పుడు ఆ కథను విన్నాడు అని  ఆ కథ తనకు నచ్చింది అని అందుకే ఆ కథను ముందుకు తీసుకుని వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు అని తెలుస్తుంది. వచ్చే ఏడాది అతను చేసే సినిమాలు ఎక్కువగా నిర్మాతగా ఉండే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఎన్ని సినిమాలు నిర్మాతగా చేస్తాడో వచ్చే ఏడాది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: