టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఏ వార్త వచ్చినా సరే ప్రేక్షకులు కచ్చితంగా మిస్ అవ్వకుండా చదివే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉండటం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనే దాని మీద అనేక వార్తలు వస్తున్నాయి గాని సినిమా ఎప్పుడు విడుదల అయ్యేది మాత్రం స్పష్టత కచ్చితంగా రావడం లేదు. వచ్చే ఏడాది ఎలా అయినా సరే సినిమాను విడుదల చేయడానికి కసరత్తులు చేస్తున్నారు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త వచ్చింది. 

 

ఈ సినిమాను వచ్చే ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశం ఉందని చాలా సన్నివేశాలను కచ్చితంగా రీ షూట్ చెయ్యాలని దర్శకుడు అంటున్నాడు అని దానికి నిర్మాత కూడా ఓకే చెప్పారు అని అంటున్నారు. అందుకే ఈ సినిమాను వచ్చే ఏడాది చివర్లో తీసుకుని రావడానికి ఇప్పుడు నిర్మాతలు ఎక్కువగా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. రీ షూట్ కారణంగా బడ్జెట్ బాగా పెరిగిపోయే అవకాశం ఉందని నిర్మాతలు భయపడినా మార్కెట్ భారీగా పెంచుకుని ఆ నష్టాన్ని కవర్ చేద్దామని ఆ విషయంలో రాజమౌళి హామీ ఇచ్చాడు అని అంటున్నారు. 

 

మరి ఈ సినిమా వస్తుందో తెలియదు గాని ఈ సినిమాలో ఏ సన్నివేశాలను రీ షూట్ చెయ్యాలి అనుకుంటున్నారు అనే దాని మీద ఇంకా స్పష్టత  లేదు. కొన్ని అడవుల్లో సన్నివేశాలు జక్కన్న కు నచ్చలేదు అని వాటిని రీ షూట్ చేయడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని టాలీవుడ్ లో టాక్. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా త్వరలో విడుదల చేసే అవకాశం ఉందని టాలీవుడ్ లో టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: