టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది యువ హీరోలు తమ అదృష్టాన్ని ఈ నేపథ్యంలో ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు నవీన్ చంద్ర.  ఆ తర్వాత ఒకటీ రెండు సినిమాల్లో హీరోగా నటించినా పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయాడు.  దాంతో విలన్ పాత్రలకు సై అన్నాడు.  ఈ నేపథ్యంలోనే నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ సినిమాలో విలన్ షేడ్స్ లో నటించాడు.  ఆ తర్వాత పలు సినిమాల్లో విలన్ గా నటిస్తూ వస్తున్నాడు. ఆ మద్య ధనుష్ నటించిన ‘లోకల్ బాయ్’ సినిమాలో విలన్ గా కనిపించాడు.  అంతే కాదు అడవి షేషు, రెజీనా నటించిన ‘ఎవరు’ లో విలన్ గా నటించాడు.  విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఈమేజ్ తెచ్చుకున్న న‌వీన్ చంద్ర   ఇలా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు నవీన్ చంద్ర.

 

తాజాగా న‌వీన్ చంద్ర హీరోగా తెర‌కెక్కిన సినిమా భా'నుమ‌తి రామ‌కృష్ణ'‌.   ఈ సినిమాలో న‌వీన్ స‌ర‌స‌న స‌లోని లూత్రా హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమాను య‌శ్వంత్ ములుకుట్ల నిర్మించారు. ఓ ఇండిపెండిట్ వెబ్ ఫిల్మ్ గా భానుమ‌తి రామ‌కృష్ఱ రూపొందించ‌డం జ‌రిగింది. ఈ సినిమాకు శ్రీకాంత్ నాగోతి ద‌ర్శ‌కుడు. న్యాచురాలిటీ కోసం ఈ సినిమాలో కీల‌క స‌న్నివేశాల్ని గొరిల్లా ప‌ద్ధ‌తిలో షూట్ చేశారు.

 

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకి రాబోతుంది.  ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల ఎన్నో సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయా.. మరెన్నో సినిమాలు రిలీజ్ లు ఆగిపోయాయి.  త్వరలో తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ జరుపుకునే అవకాశం రాబోతుంది.  ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన మ‌రిన్ని విష‌యాలు అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని య‌శ్వంత్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: