సీనియర్ హీరోలంతా అరవైలు దాటిన వారే. మామూలుగా రియల్ లైఫ్ లో అంతా తాత పాత్రలు పోషిస్తున్న వారే. అయితే సినిమాల్లో మాత్రం అందుకు భిన్నంగా పడుచు ప్రాయం అమ్మాయిలతో వారు ఆడుతూ పాడుతూ హుషార్ చేస్తున్నారు. అయితే సీనియర్ హీరోలు మిగిలిన భాషల్లో ఈపాటికి తండ్రి పాత్రల్లోకి షిఫ్ట్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి.

 

అయితే టాలీవుడ్లో మాత్రం ఇంకా పాతికేళ్ళు దాటని పాత్రలే మన సీనియర్లు వేస్తున్నారు. వారికి హీరోయిన్ దొరకడం కూడా కష్టమైపోతోంది. అయినా ఏదో విధంగా సర్దుకుని కొత్త వారినైనా తెచ్చుకుని సినిమా చేస్తున్నారు. మరి ఇన్ని కష్టాలు పడే బదులు వయసుకు, అనుభవానికి తగినట్లుగా పాత్రలు వేస్తే హుందాగా ఉంటుందని అంటున్నారు.

 

అయితే ఇందులో బాలక్రిష్ణ మాత్రం కొంత మారాలనే అనుకుంటున్నారుట. ఆయన తన పాత్రకు వెయిట్ ఉంటే తండ్రి పాత్రలోకి వెళ్లడానికి కూడా రెడీ అయ్యారని అంటున్నారు. దానికి కధను బుర్రా సాయి మాధవ్ సమకూరిస్తే సీనియర్ డైరెక్టర్ బీ గోపాల్ డైరెక్షన్ చేస్తారని, బాలయ్య బర్త్ డేకి ఆ మూవీ ప్రారంభం అవుతుందని వినిపించింది.

 

అయితే ఇపుడు ఆ కధలో తమిళ వాసనలు ఉండడంతో పాటు అక్కడ సూపర్ స్టార్ ఒకరు ఆ సినిమాను చేయడంతో అటువంటి చాయలున్న కధతో సినిమా వద్దు అని బాలయ్య అనుకుంటున్నారుట. ఇవన్నీ ఇలా ఉంచితే బాలయ్య కనుక తండ్రి పాత్ర వేసి మెప్పించినట్లైతే టాలీవుడ్ సీనియర్లకు ఒక దారి కనిపించేది. అంతే కాదు తెలుగులో మంచి కధలు వచ్చే అవకాశం కూడా ఉండేది. అయితే బాలయ్య ఆ మూవీని రిజెక్ట్ చేయడంతో సీనియర్లు ఇంకా పడుచు పాటలే పాడుకుంటారని అర్ధమైపోతోంది.

 

అయితే బాలయ్య, మరో హీరో వెంకటేష్ లాంటి వారు కధలకు ప్రాధాన్యత ఇస్తూ అవసరం అయితే పెద్ద తరహా పాత్రలు వేయడానికి రెడీ అంటున్న వేళ సరైన కధలతో వారిని అప్రోచ్ అవ్వాల్సిన బాధ్యత దర్శకులు, రచయితల మీదనె ఉంటుంది. మరి అంతా కలసి ఆలోచన చేస్తే టాలీవుడ్ దశ తిరుగుతుంది. మంచి సినిమాలు వస్తాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: