తెలుగు సినిమాల్లో చెరగని ముద్ర వేసిన మహానటుల్లో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఆశ్చర్యపరిచే డ్యాన్స్, ఫైట్లతో భారీ ఫ్యాన్ బేస్ తోపాటు, ప్రేక్షకుల్లో అనితరసాధ్యమైన క్రేజ్ ను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి మరొకరు. వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తే.. అది సంచలనమే. ట్రేడ్, బిజినెస్ వర్గాల్లో ఆసక్తే. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కు పండగే. అలాంటి సెన్సేషన్ కాంబినేషన్ తో తెరకెక్కిన సినిమా ‘మెకానిక్ అల్లుడు’. వీరిద్దరూ కలిసి తెర మీద కనిపించిన ఈ సినిమా విడుదలై నేటితో 27ఏళ్లు పూర్తయ్యాయి.   

IHG

 

బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1993 మే 27న విడుదలైంది. ఫ్యామిలీ డ్రామాతో ఈ సినిమా తెరకెక్కింది. అప్రతిహతమైన క్రేజ్ తో మెగాస్టార్ గా వెలిగిపోతున్న చిరంజీవి తన మాస్ స్కిల్స్ ను యాడ్ చేసి ఈ సినిమా చేశారు. సినిమాలో నాగేశ్వరరావు, చిరంజీవి మధ్య వచ్చే సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘గురువా గురువా’ అనే పాటలో వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేసి మెప్పించారు. చిరంజీవి, విజయశాంతి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వీరిద్దరూ కలిసి చేసిన ఆఖరు సినిమాగా మెకానిక్ అల్లుడు నిలిచిపోయింది. ఘరానామొగుడు, ముఠామేస్త్రి వంటి హిట్స్ తర్వాత వచ్చిన మాస్ సినిమా ఇది.

IHG

 

రాజ్-కోటి సంగీతంలోని పాటలన్నీ సూపర్ హిట్టే. ‘ఝుమ్మనే తుమ్మెద వేట’ పాట విజువల్ గా ఆకట్టుకుంటుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్సినిమా నిర్మించారు. చిరంజీవికి బాగా కలిసొచ్చిన వేసవిలో ఈ సినిమా విడుదలైంది. స్టేట్ రౌడీ తర్వాత చిరంజీవితో బి.గోపాల్ తెరకెక్కించిన సినిమా ఇదే. చిరంజీవి క్రేజ్ తో భారీ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మెగా అభిమానులకు కాస్త నిరాశకు గురి చేసింది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: