నేచురల్ స్టార్ నాని హీరోగా సక్సస్ ఫుల్ కెరీర్ ని లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మినిమం గ్యారెంటీ హీరోగా నిర్మాతలు నమ్మకం ఎట్టుకున్నారు. అందుకే నాని కి సినిమాలకి కొదవలేదు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేస్తున్నాడు. చెపాలంటే నాని నిర్మాతల హీరో అన్న పేరు  సంపాదించుకున్నాడు. ఇక నిర్మాతగాను మారాడు. నాని నిర్మించిన మొదటి సినిమా "అ". వాల్ పోస్టర్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు.

 

సైకలాజికల్ థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ లో రూపొందించిన ఈ కమర్షియల్ గా సక్సస్ కాకపోయినప్పటికి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అంతేకాదు మేకప్ విభాగంలో జాతీయ అవార్డుని కైవసం చేసుకుంది. ప్రశాంత్ వర్మ ఎంతో డిఫ్రెంట్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో క్లైమాక్స్ లోనే అసలు కథ ఏంటనేది రివీల్ అవుతుంది. 

 

సినిమా కథ ఏంటనేది సినిమా చివరి వరకూ అర్థం కాదు. మొదటి నుంచి పకడ్బంధీంగా రాసుకున్న స్క్రీన్ ప్లే తో క్లైమాక్స్ లోనే కీ పాయింట్ ని రివీల్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇక ప్రశాంత్ వర్మ తన రెండవ సినిమా కల్కిలోనూ అదే ఫార్మాట్ ఫాలో అయ్యాడు. ఈ రెండు సినిమాలతో ప్రశాంత్ వర్మ ఇంటిలిజెంట్ డైరెక్టర్ అనిపించుకున్నప్పటికి కల్కి సినిమా క్లైమాక్స్ మాత్రం తేడా కొట్టింది. అయినప్పటికి మళ్ళీ అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడట. మరోసారి ఇలాంటి స్క్రీన్ ప్లే తోనే మూడవ సినిమాని రూపొందింస్తున్నాడట.

 

ప్రశాంత్ వర్మ తన లేటెస్ట్ సినిమా ఫస్ట్ లుక్ ని త్వరలో రిలీజ్చే యబోతున్నాడట. గత రెండు సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసినపుడు అందులో క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో అన్న హింట్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే క్లైమాక్స్ ట్విస్ట్ కి సంబంధించిన హింట్ ఇవ్వబోతున్నాడట. అయితే ప్రతీసారీ ఇదే తరహా ఫార్ములాని వాడితో తెడా కొట్టే అవకాశాలున్నాయన్న సంగతి తెలిసిందే. సాధారణంగా దర్శకులు సినిమా సినిమాకి పూర్తి వ్యత్యాసం చూపిస్తుంటారు. మరి ఈ దర్శకుడు ఎందుకు తన పంథా మార్చడం లేదో ..?

మరింత సమాచారం తెలుసుకోండి: