ఇప్పుడు మన తెలుగులో కొన్ని కొన్ని సినిమాలు భిన్నంగా వస్తున్నాయి. గతంలో హీరో అనగానే ఇలాగే నటించాలి అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉండేది. మ‌న తెలుగులో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా హీరోయిజం పండించాలి. ఊర‌మాస్ సినిమాకు మ‌న హీరోలు కేరాఫ్ అడ్ర‌స్ గా మారిపోయారు. ప‌ర‌మ రొటీన్ క‌థ‌ల‌కు అల‌వాటు ప‌డిన మ‌న స్టార్ హీరోలు ఆ ఇమేజ్ చ‌ట్రం నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి చాలా ఇబ్బంది ప‌డుతున్నారు. పది మందిని కొట్టడం తో పాటుగా పది మందిని నరికి చంపడం, లేదా డాన్స్ లు వేయడం వంటివి ఉండేవి. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హీరోలు ఎంత కొత్తగా సినిమాలు చేస్తే వారికి అంత మంచి గుర్తింపు ఉంటుంది. ప్రేక్షకులు కూడా అదే చూస్తున్నారు.



అందుకే ఇప్పుడు హీరోలు ఆ విధంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసమే ఎక్కువగా కష్టాలు పడుతున్నారు. చిన్న హీరోలు అయినా... పెద్ద హీరోలు అయినా సరే నటనలో భిన్నం అనే కోణం చూపించాలి అనుకుంటున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే ప్రయత్నం లో ఉన్నాడు. ఇప్పటికే అతను సుకుమార్ సినిమా రంగ‌స్థ‌లంలో  చెవిటి వాడిగా నటించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక అక్కడి నుంచి అతను కొత్తగా కనపడే ప్రయత్నాలు చేస్తున్నాడు.



ఇప్పుడు రాబోయే అనీల్ రావిపూడి సినిమాలో అతను కుంటివాడి గా నటించే అవకాశం ఉందని అలాగే సినిమా సగం సీన్ల‌లో అతను పక్షవాతం తో నటించే అవకాశం ఉందని సమాచారం. అయితే అక్క‌డ ట్విస్ట్ ఉంటుంద‌ట‌. ఆ సినిమా కోసం అతను ఆర్ఆర్ఆర్ సినిమా అయిన తర్వాత బెంగళూరు కూడా వెళ్ళే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఏ విధంగా అతను నటిస్తాడు అనేది చూడాలి. ఏదేమైనా చ‌ర‌ణ్ స‌రికొత్త ప్ర‌యోగంతో ముందుకు వెళుతుండ‌డం మంచి ప‌రిణామం అనే చెప్పాలి.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: