కొన్ని రికార్డులు అలా శాశ్వతంగా ఉండిపోతాయి. వాటిని బద్దలు కొట్టడం ఎవరి వల్లా కాదు, వాటిని స్థాపించిన వారు రణజన్ములు, కారణజన్ములు. అందువల్ల వాటిని కనీసం టచ్ చేయడానికే గుబులు పుట్టుకొస్తుంది. అటువంటి వారు ఒక చరిత్ర. అలాంటి చరిత్ర పురుషుడు ఎన్టీయార్ అని చెప్పాలి.

 

ఎన్టీయార్ ఎన్నో సినిమాలు చేసారు. అన్ని పాత్రలను అద్వితీయంగా చేసి వాటికి ప్రాణం పోశారు. ఇక ఎన్టీయార్ పౌరాణీకాలకు పెట్టింది పేరు. ఆయన అందులో పండిపోయారు. ఆయన దేవుడి నుంచి వరంగా అద్భుతమైన అహార్యాన్ని పొందారు.

 

దానికి తోడు గంభీరమైన వాచకం. స్వచ్చమైన తెలుగు, భాషను ఎలా వాడాలో,ఎక్కడ ఎలా పలకాలో తెలిసిన నైపుణ్యం ఇవన్నీ కలసి ఆయన్ని పౌరాణిక పాత్రలకు రారాజుని చేశాయి. ఆయనే క్రిష్ణుడు, ఆయనే ధుర్యోధనుడు. ఇలా హీరో, విలన్ ఒకే తెర మీద వేసి మురిపించడం అంటే అది ఒక్క ఎన్టీయార్ కే చెల్లింది. 

 

ఎన్టీయార్ 1976న దానవీర శూర కర్ణ సినిమా తీశారు. ఆ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఒక గ్రంధమే అవుతుంది. ఆ సినిమాలో ఎన్టీయార్ మూడు ప్రధాన పాత్రలు వేశారు. పైగా ఆయనే కధ, స్క్రీన్ ప్లే , డైరెక్షన్. మరో వైపు సొంత నిర్మాణ సంస్థ ద్వారా నిర్మాణ బాధ్యతలు మోశారు. 

 

ఇన్ని చేసినా ఆ సినిమా తీసింది కేవలం 45 రోజుల్లో మాత్రమే. ఎన్టీయార్ క్రిష్ణుడిగా, ధుర్యోధనుడిగా, కర్ణుడిగా అద్భుతంగా వెండితెరను పండించారు.  ఈ సినిమా 1977లో సంక్త్రాంతి పండుగకు రిలీజ్ అయింది. సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఆ రోజుల్లో ఏకంగా కోటి రూపాయలు వసూల్ చేసింది. 

 

ఆ రోజుల్లో సినిమా టికెట్ బాల్కనీ రూపాయిన్నర ఉన్న కాలంలో కోటి రూపాయలు వసూల్ చేసిన ఏకైక చిత్రం. తెలుగు సినిమా స్టామినాను నిరూపించిన చిత్రం కూడా ఇదే. ఇక ఈ సినిమా నిడివి నాలుగు గంటల పదిహేను నిముషాలు. అంటే దాదాపు 23 రీళ్ళు అన్నమాట.

 

ఎన్నో పాటలు, మరెన్నో పద్యాలు, యుధ్ధ సన్నివేశాలు, తలచుకుంటే బాబోయ్ అనిపిస్తుంది. పని రాక్షసుడిగా మారి ఈ చిత్రాన్ని రామారావు తీశారా అనిపిస్తుంది. ఇక ఈ సినిమా మరో గొప్పతనం ఏంటి అనే 1994లో మరో మారు ఈ సినిమా తెలుగు రాష్ట్రాలో రిలీజ్ అయి మళ్ళీ కోటీ రూపాయలు ఆదాయం తెచ్చిపెట్టింది. మొత్తానికి ఈ రికార్డు ఎవరూ బద్దలుకొట్టలేనిదే. దటీజ్ ఎన్టీయార్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: