టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పంచ్ డైలాగులు సిల్వర్ స్క్రీన్ పై అదరగొట్టే రీతిలో పేలుతాయి అని అందరికీ తెలుసు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి టాప్ హీరోగా ఉన్న టైం నుండి ఇప్పటి టాప్ హీరోల వరకూ త్రివిక్రమ్ దాదాపు అందరి తో పనిచేయడం జరిగింది. ఇదే రీతిలో కుర్ర హీరోల తో కూడా వర్క్ చేశారు. ఈ నేపథ్యంలో నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్‌.రాధాకృష్ణ దర్శకత్వంలో 'హారిక అండ్ హాసిని' క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా ‘అ ఆ’. 2018 ఈ సంవత్సరం లో రిలీజ్ అయిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.

 

నితిన్ పక్కన హీరోయిన్ గా సమంత నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అటువంటి త్రివిక్రమ్ సినిమా అయినా ‘అ ఆ’ యూట్యూబ్ లో వన్ మిలియన్ వ్యూస్ అందుకుని సరికొత్త రికార్డు సోషల్ మీడియాలో సృష్టించింది. నితిన్ నటించిన ఈ సినిమా హిందీలో ఆగస్టు 28 వ తారీకు 2018 వ సంవత్సరంలో యూట్యూబ్ లో రిలీజ్ అయింది. బాలీవుడ్ ఇండస్ట్రీ సినిమా ప్రేక్షకులు ‘అ ఆ’ సినిమాని యూట్యూబ్ లో బాగా ఆదరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా యూట్యూబ్‌లో 1 మిలియన్ లైక్స్‌ని సంపాదించుకుంది.

 

'బాహుబలి' సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి డిమాండ్ పెరగడంతో టాలీవుడ్ సినిమాలకు ఇతర ఇండస్ట్రీలలో డిమాండ్ పెరిగింది. ఇతర ఇండస్ట్రీలో ఫ్లాపుల్లో ఉన్న హీరోలు తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలను వారి భాషలలోకి రీమేక్ చేస్తూ అదిరిపోయే విజయాలు కూడా సాధిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు చాలామంది టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలను యూట్యూబ్ లో బాగా ఆదరిస్తున్నారు. అంతే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ల సినిమాలను యూట్యూబ్ లో చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’ సినిమా కి యూట్యూబ్ లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: