ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన భామ రాశీ ఖన్నా ఆ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుని, నటనలో విమర్శకుల ప్రశంసలు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత ఆమె చాలా సినిమాల్లో కనిపించినా మొదటి సినిమాకి వచ్చినంత ఫేమ్ మరే సినిమాకీ రాలేదు. వరుస ఫ్లాపులు వెంటాడుతున్న టైమ్ లొ వెంకీమామా, ప్రతిరోజూ పండగే సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకుని మళ్ళీ ట్రాక్ లోకి వచ్చింది.

 

అయితే కరోనా కాలంలో చాలా మంది సెలెబ్రిటీలు ఇంటివద్దే ఉన్నారు. నాలుగవ విడత లాక్డౌన్ లో భాగంగా కొన్ని వ్యాపార కార్యకలాపాలకి మినహాయింపులు ఇచ్చిన ప్రభుత్వం సినిమా షూటింగులకి పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో సెలెబ్రిటీలందరూ ఇంటిపట్టునే ఉంటున్నారు. దాంతో చాలా మంది నటీనటులు తమలోని అభిరుచిని అభివృద్ధి చేసుకుంటుండగా, మరికొంత మంది కొత్త అభిరుచులని అలవాటు చేసుకుంటున్నారు. 

 

 

తెలుగు సినిమాల్లో మెరిసిన రాశీ ఖన్నా ఈ లాక్డౌన్ సమయాన్ని చాలా ప్రొడక్టివ్ గా వాడుకుంటోంది. పంజాబీ రాష్ట్రం నుండి వచ్చిన రాశీకీ తెలుగు బాగా వచ్చు. ఊహాలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చి, మొన్న వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకి తన డబ్బింగ్ తానే చెప్పుకునే స్థాయికి ఎదిగింది. అయితే అటు తమిళ సినిమాల్లోనూ అవకాశాలు వస్తుండడంతో తమిళ భాషపై దృష్టి పెట్టింది. లాక్డౌన్ సమయంలో తమిళ భాషని నేర్చుకుంటూ బిజీగా ఉంటోంది. 

 

 

ఆన్ లైన్ వేదికగా తమిళం నేర్చుకుంటూ బిజీగా గడుపుతోంది. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో బిజీ కావడానికి రాశీ ఖన్నా చాలా గట్టిగానే ప్రయత్నిస్తోంది. అందం అభినయం ఉండీ తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నా స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయిన రాశీ ఖన్నా తమిళంలోనైనా వరుస అవకాశాలు తెచ్చుకుంటూ స్టార్ హీరోయిన్ అనిపించుకుంటుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: