మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ గానే కాకుండా 'ఫ్యామిలీ మ్యాన్'గా కూడా పిలవబడుతుంటాడు. సినిమా షూటింగ్ పనులలో తాను ఎంత బిజీగా ఉన్నా.. సమయం దొరికినప్పుడు తన కుటుంబంతో స్పెండ్ చేస్తుంటాడు. మొదటి నుంచి కూడా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తున్నాడు మహేష్. ముఖ్యంగా తన పిల్లలతో సాధ్యమైనంత ఎక్కువ సమయం గడపడానికి ట్రై చేస్తారు. వారికి ఫ్యామిలీ లైఫ్ మిస్సవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అందుకే ఆయన ఆన్ స్క్రీన్ లోను.. ఆఫ్ స్క్రీన్ లోనూ సూపర్ స్టారే అంటుంటారు ఆయన అభిమానులు. ఇప్పుడు ఇంకా కావాల్సినంత సమయం దొరకడంతో పండగ చేసుకుంటున్నాడు మహేష్. గౌతమ్ సితారాలతో కలిసి ఆడుకుంటూ చిన్న పిల్లాడిగా మారిపోతున్నాడు. అలానే వర్కౌట్స్ చేసుకుంటూ ఫిట్నెస్ మీద ఫోకస్ పెడుతున్నాడు.

 

మహేష్ ఒకవైపు సామాజిక అంశాలపై స్పందిస్తూనే మరోవైపు ఫ్యామిలీ టైమ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో సోషల్ మీడియా ద్వారా తెలియాజేస్తూనే ఉన్నాడు. డైలీ ఇదొక పోస్ట్ పెడుతూ అభిమానులను ఖుషీ చేస్తూ వస్తున్నాడు. మహేష్ సతీమణి నమ్రత కూడా వారి అల్లరి చేసే వీడియోలను పోస్టు చేస్తూ ఉంటుంది. తన పిల్లలతో మహేష్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ - గౌతమ్ ఇద్దరూ తండ్రీ కొడుకులు గా కాకుండా అన్నదమ్ముల్లా స్నేహితులు లాగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ మధ్య మహేష్ బాబు పోస్ట్ చేసే ఫోటోలు చూస్తుంటే మహేష్ ఏజ్ తగ్గుతూ వస్తోందా అనే అనుమానం కలగక మానదు. మహేష్ బాబు ఇప్పుడు తన ఏజ్ ను రివర్స్ గేర్ లో పెట్టి వెనక్కి లాగేసారా అన్న అనుమానం ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ కు కలుగుతుంది.

 

ఇప్పుడు తాజాగా మహేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పిక్ చూస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవ్వకుండా ఉండలేరు. కూతురు సితారతో అద్దం దగ్గర నిల్చొని మహేష్ దిగిన మిర్రర్ సెల్ఫీ అయితే మరింత పిచ్చెక్కిస్తుంది. ఇందులో ఈయన సితారకే అన్నయ్యలా ఉన్నాడంటే అతిశయోక్తి కాదేమో. ఈ ఫోటో చూసిన మహేష్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. మహేష్ అన్నం తింటున్నాడా.. అందం తింటున్నాడా అనే డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఇదిలా ఉండగా ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాని కృష్ణ బర్త్ డే సందర్భంగా మే 31న లాంఛనంగా ప్రారంభించే అవకాశాలున్నాయి. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Finding our reflections!! Mastering the mirror selfie with @sitaraghattamaneni ❤️❤️❤️

A post shared by mahesh Babu (@urstrulymahesh) on

మరింత సమాచారం తెలుసుకోండి: