బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది.  ఆయన చిత్రాలంటే ఇప్పటికే ఫ్యాన్స్ ఇంకా ఎంతో మంది ఉన్నారు.  అమితాబచ్చన్ నటించిన షోలే కొన్ని సంవత్సరాల పాటు థియేటర్లలో ప్రదర్శించబడింది.  యాక్షన్, రొమాంటిక్, కామెడీ ఏదైనా ఆ పాత్రలో లీనమైన అందరినీ ఆకట్టుకునే స్వభాయం ఆయనది.  ఇప్పటికీ యువ హీరోలకు పోటీగా నటిస్తున్నారు.  సాధారణంగా ఒక ప్రయోగాత్మక పాత్రలో నటించాలంటే ఎంతో గట్స్ ఉండాలి.. అందుకు తగ్గ మేకప్ ఉండాలి.. దాని కోసం ఎంతో కష్టపడాలి.  భారతీయ చలన చిత్ర రంగంలో అమితాబ్, కమల్ హాసన్ ఈ మద్య విక్రమ్ లాంటి నటులు పాత్రకు తగ్గట్టుగా కొన్ని గంటల పాటు మేకప్ వేసుకొని నటిస్తున్నారు.  అలాంటిదే సూజిత్ సర్కార్ దర్శకత్వంలో అమితాబచ్చన్ నటిస్తున్న 'గులాబో సితాబో' చిత్రం.

 

ఈ చిత్రంలో అమితాబ్ గుబురు గడ్డంతో కనిపించనుండగా, షూటింగ్ సహజంగా రావాలన్న ఆలోచనతో లక్నోలోని హజరత్ గంజ్, చౌక్ వీధుల్లో షూటింగ్ చేశారు. అది కూడా చాలా తక్కువ మందితోనే పని పూర్తి చేశారు. అయితే షూటింగ్ పూర్తి కాగానే కాస్త రిలాక్స్ కోసం అమితాబచ్చన్ ఆ ఇరుకు వీధుల్లో కొద్ది సేపు చక్కర్లు కొట్టారు. అక్కడ ఉండే స్థానికులతో మాట్లాడుతూ ఉన్నా, ఆయన ఎవరన్న విషయాన్ని ఎవరూ గుర్తించలేదట.

 

ఆ వీధుల్లోనే కూర్చుంటూ, అక్కడే తింటున్నా ఎవరికీ తెలియలేదని సూజిత్ చెప్పుకొచ్చారు. కాగా, లాక్ డౌన్ కారణంగా   థియేటర్లు మూతపడిన వేళ, ఓటీటీ ప్లాట్ ఫామ్ మాధ్యమంగా అమెజాన్ ప్రైమ్ లో వచ్చేనెల 12న సినిమా విడుదల కానుంది.  గతంలో సింగర్ సూనూ సూద్, మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ లు మారు వేశాల్లో తిరిగారు.. కానీ ఎవ్వరూ గుర్తు పట్టలేదు. తమ హీరో థియేటర్లో అందంగా కనిపిస్తారు.. ఇలా ఎలా ఉంటారన్న అభిప్రాయం అభిమానులది. 

మరింత సమాచారం తెలుసుకోండి: