మన దేశం పల్లెటూరి పిల్ల అలాంటి చిత్రాల్లో నటించిన నందమూరి తారక రామారావు ఆ తర్వాత కథాబలం ఉన్న పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించి అందరి మన్ననలను పొందారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఈ ఆర్టికల్ ద్వారా తను నటించిన అత్యుత్తమ చిత్రాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలియజేయపోతున్నాం. 

 


1. మాయాబజార్

కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన మాయాబజార్ చిత్రం 1957 వ సంవత్సరంలో విడుదల కాగా... అందులో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు, సావిత్రి, రేలంగి తదితరులు నటించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ లార్డ్ కృష్ణ పాత్రలో నటించాడు. మాయాబజార్ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం గా పేరు పొందింది. Cnn news18 నిర్వహించిన పోల్ సర్వేలో మాయాబజార్ చిత్రం బెస్ట్ మూవీగా ఎంపిక కాబడింది. 

 

2. గుండమ్మ కథ

1962వ సంవత్సరంలో విడుదలైన గుండమ్మ కథ సినిమా లో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్ వి. రంగారావు, సావిత్రి, జమున సూర్యకాంతం ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో పేదవాడికి ధనవంతుడిగా రెండు పాత్రల్లో ఎన్టీఆర్ నటనకు ప్రజలు ఫిదా అయిపోయారు. దర్శకుడు కమలాకర కామేశ్వరరావు సూర్యకాంతం పాత్ర మీదనే నాకే గుండమ్మ కథ అనే పేరును పెట్టారు. ఇప్పటికీ ఈ చిత్రం ఒక క్లాసిక్ మూవీ గా యొక్క ప్రేక్షకుడిని అలరిస్తుంది అంటే అతిశయోక్తి కాదు. నేటి తరం యువత కూడా ఈ కుటుంబ కథా చిత్రం ఒక్కసారైనా చూడాల్సిందే. 

 


3. మిస్సమ్మ

1955 జనవరి 12 వ తేదీన హాస్య చిత్రంగా తెరకెక్కిన మిస్సమ్మ లో అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీఆర్ కలిసి నటించారు. రామారావు సరసన అద్భుత నటి సావిత్రి కథానాయకిగా నటించింది. అప్పట్లో ఈ చిత్రం ఘన విజయం సాధించింది. రామారావు సినిమాల్లో మిస్సమ్మ ఒక్కసారైనా చూడవలసిన లిస్టులో ఖచ్చితంగా ఉంటుంది. 

 

ఇకపోతే సహజ నటి అంజలి నటించిన లవకుశ, దానవీరశూరకర్ణ, బడిపంతులు యమగోల పాతాళభైరవి పెళ్ళిచేసి చూడు లాంటి సినిమాలు తెలుగు పరిశ్రమలోనే బెస్ట్ చిత్రాలుగా ఇప్పటికీ నిలుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: