తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సాగించిన హవా గురించి ప్రత్యేకించి చెప్పేదేం లేదు. మూడు దశాబ్దాలకు పైగా నెంబర్ వన్ స్థానంలో మెగాస్టార్ హోదాలో వెలిగిపోతున్నాడు. ఆయన ఫ్లాప్ సినిమాలు కూడా డీసెంట్ కలెక్షన్లు సాధించేవి. కానీ.. ఇప్పుడు చిరంజీవిపై ఈ జనరేషన్ లోని కొందరు ఆయన సాధించిన రికార్డలపై సోషల్ మీడియా వార్ మొదలుపెట్టారు. 28ఏళ్ల క్రితం ఘరానామొగుడుతో ఆయన సాధించిన తిరుగులేని రికార్డులపై విమర్శలు చేస్తున్నారు. దీనికి మెగా అభిమానులు ధీటుగా స్పందిస్తూ ఏకంగా #ChiruEmperorOFTFI అని హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ధీటుగా సమాధానం ఇస్తున్నారు.

IHG

 

నిజానికి 1992లో చిరంజీవి ఘరానామొగుడుతో తొలి 10కోట్ల షేర్ సాధించాడు. ఇండియాలోనే 1.25 కోట్ల పారితోషికం తీసుకున్న తొలి హీరోగా నిలిచాడు. చిరంజీవి సృష్టించిన ప్రభంజనానికి బాలీవుడ్  కూడా ఆశ్చర్యపోయింది Bigger than Bachan అంటూ బాలీవుడ్ కూడా ముఖచిత్ర కథనాలు రాసింది. రజినీకాంత్ కూడా ఆ సమయంలో 60లక్షలకు మించి తీసుకోలేదు. చిరంజీవికి సమకాలీకులుగా టాలీవుడ్ లో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ నిలిచారు. పోటాపోటీగా సినిమాలు చేశారు. వారికీ సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. కానీ.. సోషల్ మీడియా విస్తృతమయ్యాక కొందరు దురభిమానులు ఇటువంటి అనవసర వివాదాలు సృష్టిస్తున్నారు.

IHG

 

రాజకీయాల్లోకి వెళ్లి పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు చిరంజీవి. తిరిగొచ్చి ఇప్పటికి చేసిన రెండు సినిమాలు కూడా 100కోట్ల షేర్ సాధించాయి. చిరంజీవికి ప్రేక్షకుల్లో ఉన్న అభిమానానికి ఇది తిరుగులేని సమాధానం. ఈరోజుల్లో హిట్టైన సినిమాలు కూడా కొన్ని100కోట్ల మార్క్ చేరుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో చిరంజీవి ఎవరికీ పోటీ కాదు. అయినా కొందరు చిరంజీవిని సోషల్ మీడియాలో డీగ్రేడ్ చేయాలని చూస్తున్నారు. ఇదంతా వారికి వృథా ప్రయాస తప్పితే ఎటువంటి ఉపయోగం లేదు.

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: