నేడు స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఎన్టీఆర్ అంటేనే ఒక విప్లవం... ఎన్టీఆర్ అంటేనే ఒక చరిత్ర... ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కొత్త అధ్యాయానికి నాంది పలికిన నటసార్వభౌముడు ఎన్టీఆర్. దాదాపు 400 సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు. కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు, రావణాసురుడు ఏ పాత్రలోనైనా నటించి మెప్పించడం ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైంది. 
 
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా నేడు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా "తెలుగుజాతి పౌరుషం తెలుగుజాతి రాజసం తెలుగుజాతి కీర్తి తెలుగు జాతి వీరత్వం తెలుగు జాతి సంపద నందమూరి తారక రామారావు గారికి వందనం" అని ట్వీట్ చేశారు. 

 


 
మెగాస్టార్ చిరంజీవి సీనియర్ ఎన్టీఆర్ ను ప్రశంసిస్తూ సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు. "తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం... తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం...నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ... ఆయనచూపులో కరుణ ,ఆయన పలుకులో దీవెన , ఆయన నడకలో రాచ ఠీవి , పౌరాణిక ,జానపద ,చారిత్రక ,సాంఘిక పాత్రపోషణలో విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ,తెలుగు వారికి అన్నగారు , అభిమానులకు కలియుగదైవం , నందమూరి తారక రాముని జన్మదినం నేడు" అని ట్వీట్ చేశారు. 


 
ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ " విశ్వ విఖ్యాత నట రత్న నందమూరి తారక రామారావు గారి జయంతి" అని ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర " విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి నేడు... N........ నటన, T.......... తెగింపు, R........... రాజసం అని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు "ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీనటుడు శ్రీ నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా తెలుగువారి హృదయాల్లో నిలిచిపోయిన శ్రీ ఎన్టీఆర్ గారు పేదలు, రైతులు, మహిళాభ్యుదయానికి చేసిన కృషి చిరస్మరణీయం" అని ఎన్టీఆర్ సేవలను పొగుడుతూ ట్వీట్ చేశారు. 


 
ఎంపీ గల్లా జయదేవ్ " మరణంలేని జననం ఎన్టీఆర్, అలుపెరగని గమనం ఎన్టీఆర్, అంతేలేని పయనం ఎన్టీఆర్. ఆ మహనీయుడుని స్మరించుకోవటం అనేది తమ జాతినీ, తమ భాషనీ మరియూ తమని తాము గౌరవించుకున్నట్లుగా భావిస్తూ తెలుగు ప్రజల నీరాజనాలు అందుకున్న మహానేత ఎన్టీఆర్ గారి 97వ జన్మదిన సందర్భంగా ఇవే నా నీరాజనాలు అని ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: