దివంగత నటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు భారత దేశంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన నటనా ప్రతిభ గల యాక్టర్ అని ఒప్పుకోక తప్పదు. తాను దాదాపు నాలుగు వందల సినిమాల్లో కొన్నివేల క్యారెక్టర్ల లో అత్యద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేశారు. రాజు గా గానీ, పేదవాడిగా కానీ, దేవుడిలా గానీ, రాక్షసుడిలా గానీ తనకు ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో అత్యంత సహజంగా ఒదిగిపోగల నటనా చాతుర్యం ఎన్టీరామారావు కి పుట్టుకతో వచ్చింది. 


అయితే భారతదేశంలో గొప్ప నటుడు ఎవరు అనేది ఒక ప్రముఖ ఇంగ్లీష్ ఆన్లైన్ పత్రిక ఐన cnn ibn పోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భారతదేశం నలుమూలల నుండి ప్రతి ఒక్క యాక్టర్ కి ప్రజలు ఓట్లు వేయవచ్చు. శ్రీదేవి కమల హాసన్ రజనీకాంత్ లాంటి ఎంతో మంది ఈ పోల్ సర్వేలో పోటాపోటీగా తల పడ్డారంటే అతిశయోక్తి కాదు. 


భారత సినిమా రంగం ప్రారంభమయి వంద సంవత్సరాల అయిన సందర్భంగా... 2013 సంవత్సరంలో నిర్వహించిన ఈ పోల్ సర్వేలో మొత్తం ఓట్లలో నందమూరి తారకరామారావు 53 శాతం ఓట్లను సంపాదించుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ఎన్టీరామారావు పాపులారిటీ భారతదేశంలో ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ ఐశ్వర్యారాయ్ మాధురి దీక్షిత్ ఇలాంటి బాల హిందీ ప్రముఖులు కూడా కేవలం ఐదు పది శాతం ఓట్లతో సరిపెట్టుకున్నారు. మిగిలిన ఓట్లలో 44 శాతం తమిళ యాక్టర్ కమల్ హాసన్ సంపాదించుకోగా... మోహన్ లాల్ కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమే సంపాదించారు. 


మిగిలిన ఓట్లలో అందాల తార శ్రీదేవి 39 శాతం ఓట్లను సంపాదించగా... మాధురి దీక్షిత్ 16, సావిత్రి 12 శాతం ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఏది ఏమైనా భారతదేశ సినీ రంగం ఉన్నప్పటి వరకు ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో బతుకుతూనే ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: