ఎన్టీ రామారావు సినిమా అంటేనే అప్పట్లో ప్రజలు చెవి కోసుకునే వారు. ఏఎన్ఆర్ సినిమాలు చూడమంటే కూడా ప్రేక్షకులకు మిక్కిలి ఇష్టం. తన చిత్రాల్లో కథాబలంతో పాటు ఘంటసాల పాడిన పాటలు మధురాతి మధురంగా ఉంటాయి. ప్రేమనగర్, దేవదాసు, మూగ మనసులు దసరా బుల్లోడు, భక్తతుకారం లాంటి సినిమాలు ఘంటసాల అద్భుతమైన పాటలు, ఏఎన్ఆర్ నటనా చాతుర్యం ప్రతి ప్రజలను ఎంతగానో అలరించాయి. అయితే నటసార్వభౌముడు ఎన్టీఆర్ ఏఎన్నార్ కలిసి వెండితెరపై కనిపిస్తే ఆయన అభిమాన ప్రేక్షకులకు పెద్ద కనులవిందు అని చెప్పుకోవచ్చు. 


తెలుగు ప్రేక్షకుల కోసం ఏఎన్ఆర్, ఎన్టీఆర్ కలిసి 14 సినిమాల్లో నటించారు. 1950 లో రిలీజ్ అయిన పల్లెటూరి పిల్ల చిత్రంలో అంజలి దేవి, అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో అక్కినేని నాగేశ్వరావు ఎన్టీరామారావు మంచి స్నేహితులయ్యారు. అదే సంవత్సరంలో విడుదలైన సంసారం చిత్రంలో మొట్టమొదటి గా ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు అన్నదమ్ముల పాత్రలలో నటించారు. 


మళ్ళీ మూడు సంవత్సరాల అనంతరం అనగా 1954లో రేచుక్క పగటి చుక్క అనే చిత్రంలో ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించారు. ఈ చిత్రానికి గాయకుడు ఘంటసాల నిర్మాతగా బాధ్యతలు చేపట్టగా... పి పుల్లయ్య దర్శకత్వం వహించాడు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే పాట కలిగిన మిస్సమ్మ చిత్రంలో కూడా ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించారు. కృష్ణదేవరాయల పాత్రలో ఎన్టీఆర్, తెనాలి రామకృష్ణ పాత్రలో ఏఎన్ఆర్ నటించిన చిత్రం తెనాలి రామకృష్ణ అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. గుండమ్మ కథ, భూకైలాస్, మాయాబజార్, చాణక్య చంద్ర గుప్తా, కృష్ణార్జున యుద్ధం, సత్యం శివం... ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో వీళ్లిద్దరు కలిసి నటించారు. 1950 నుంచి 1981వరకు 14 సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు పరిశ్రమలోనే ఏ స్టార్ హీరోలు కలసి నటించిన సినిమాల కంటే ఎక్కువగా వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలే ఎక్కువ. నిజమైన బడా హీరోలు మల్టీస్టారర్ సినిమాలు ఇప్పుడు కూడా తెరకెక్కిస్తే అభిమానులు పండగ చేసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: