తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఎన్నటికి చెరిగిపోని ముద్ర వేసుకున్నారు నందమూరి తారక రామారావు. ఒక సాదాసీదా వ్యక్తి గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై ఒక మహోన్నత వ్యక్తిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. ముఖ్యంగా పౌరాణిక సినిమాలకు నందమూరి తారకరామారావు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ ఆయనకు ఆయనే సాటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే నటన విషయంలో ఎంతో డెడికేషన్ చూపించేవారు నందమూరి తారక రామారావు... ముఖ్యంగా ఎక్కువ శాతం ఎలాంటి డూప్  లేకుండానే పలు సన్నివేశాల్లో కూడా స్వయంగా నటిస్తూ ఉండేవారు. ఆయనను ఒక నటుడిగా ఆదరిస్తున్న సినీ ప్రేక్షకులు అందరిని ఆయన ఎంతో ఆరాధించేవారు. 

 

 అయితే ఎన్టీఆర్ తన నట జీవితంలో మొత్తంగా నాలుగు భాషల్లో కలిపి నాలుగు వందల సినిమాలకు పైగా నటించారు. ఇప్పటికి కూడా ఏ హీరోకి ఈ ఘనత సాధ్యం కాలేదు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం నందమూరి తారక రామారావు అసలు సిసలైన వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో మనవడు జూనియర్ ఎన్టీఆర్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాత సీనియర్ ఎన్టీఆర్ పట్ల ఎంతో ఆదరాభిమానాలను చూపిస్తూ ఉంటారు జూనియర్ ఎన్టీఆర్. ఇక తాత గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు. 

 

 ఒకానొక సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తన తాతకు సంబంధించి ఒక విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. నటన పట్ల తాత సీనియర్ ఎన్టీఆర్ కు ఎంత డెడికేషన్ ఉండేది అనే విషయాన్ని చెప్పుకొచ్చారు మనవడు జూనియర్ ఎన్టీఆర్. ఒక సినిమా చిత్రీకరణ సమయంలో... ఒక బెత్తంతో తొడపై  గట్టిగా కొట్టుకోవలసి వస్తుందని... అయితే అప్పటికే ఆ షాట్  రెండు మూడు సార్లు తెరకెక్కించ గా... డైరెక్టర్ ఓకే చెప్పారని... కానీ ఆ సీన్ చూసిన తర్వాత తాత ఎన్టీఆర్ కు మాత్రం సంతృప్తి కలగకపోవడంతో తర్వాత రోజు అదే సీన్ చిత్రీకరించాలని డైరెక్టర్ చెప్పడంతో డైరెక్టర్ కూడా ఒప్పుకున్నారు. ఆ తర్వాత మొదటి షాట్ లోనే ఆ సీన్ ఓకే చేశారు అంటూ చెప్పుకొచ్చారు. తాత ఆ సీన్ మళ్లీ ఎందుకు చేయించారు అంటే ఆ సీన్లు ముఖంలో కాస్త ఎక్స్ప్రెషన్ మిస్సయింది అని అనిపించడం వల్లే అలా చేయించారని ఆ తర్వాత రోజు సినిమా షూటింగ్ లో  గట్టిగా తొడపై  కొట్టుకోవడం తో పూర్తిగా వాతలు  కమిలిపోయి ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఆ ఒక్క ఘటనతో తాతగారికి నటనపై ఎంత డెడికేషన్ ఉండేదో అర్థమైంది అంటూ చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: