తెలుగు చిత్ర పరిశ్రమలో నాటి తరంలో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎంతో మంది ప్రముఖుల జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది ప్రముఖులు సినిమాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి అనే సినిమా తెరకెక్కిన  విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలయ్యి తెలుగు చిత్ర పరిశ్రమలో ఊహించని ఘన విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా తర్వాత తెలుగు ప్రజల ఖ్యాతిని ఎంతగానో పెంచిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించాలని భావించారూ  ఆయన తనయుడు బాలకృష్ణ. 

 


 ఈ క్రమంలోనే ఆయన జీవిత చరిత్రలో సినీ ప్రస్థానాన్ని కథానాయకుడిగా... రాజకీయ ప్రస్థానంని  మహానాయకుడిగా తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే ఈ సినిమాకు నందమూరి తారక రామారావు తనయుడు బాలకృష్ణ నిర్మాతగానే కాదు... తండ్రి పాత్రలోనూ  బాలకృష్ణ నటించారు. ఇక ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ప్రేక్షకుల ఆదరణ మాత్రం ఈ సినిమా పొందలేకపోయింది.అయితే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ అటు బాలకృష్ణకు నిర్మాతగా ఎన్నో నష్టాలు తెచ్చిపెట్టింది అని చెప్పాలి. 

 

 అయితే నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ రెండు పార్ట్ లు  కూడా ప్రేక్షకుల ఆదరణ పొందలేక డిజాస్టర్గా మిగిలిపోయింది. అయితే నందమూరి తారకరామారావు బయోపిక్ మరీ అంతలా ఘోర పరాజయం పాలవడానికి రెండు కారణాలు ఉన్నాయి అని చెప్పొచ్చు. ఒకటి ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించాలని బాలకృష్ణ ప్రకటన విడుదల చేసినప్పటి నుంచి... ఎన్టీఆర్ జీవితం లోని అసలు నిజాలు నేను చెబుతాను అంటూ రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సంచలనం సృష్టించారు. అంతేకాకుండా బాలకృష్ణ నిర్మాతగా హీరోగా తెరకెక్కిన కథానాయకుడు మహానాయకుడు సినిమాలలో వాస్తవాలను చూపించకుండా.. సినిమాలను తెరకెక్కించారు అనే వాదన కూడా బలంగా వినిపించింది. అందుకే ఈ సినిమా ప్రేక్షకులకు  చేరలేక పోయింది అని అంటారు సినీ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: