తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో కి ఎంత ప్రత్యేకత ఉందో అందరికీ తెలిసిందే. ఏడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ కామెడీ షో  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది.  జబర్ధస్త్ కామెడీ షో లో కొంత కాలంగా కొత్త నటులు ఎంట్రీ ఇస్తున్న విసయం తెలిసిందే.  తెలుగు ప్రేక్షకుల్లో చాలా మందికి గురు, శుక్రవారాలంటే ఎక్కువ ఇష్టం.  గత కొంత కాలంగా రాకెట్ రాఘవ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నారు.   ఎందుకంటే ఆ రోజు నవ్వులు పూయించే జబర్దస్త్ కామెడీ షో, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో వస్తాయి.  జబర్ధస్త్ షో ద్వారా ఎంతో మంది కళాకారులు ఇప్పుడు మంచి పొజీషన్లో ఉన్నారు. అంతే కాదు వెండి తెరపై కూడా తమ సత్తా కొనసాగిస్తున్నారు. వేణు, ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్, రాకెట్ రాఘవ ఈ మద్య గెటప్ శీను కూడా వెండితెరపై కనిపిస్తున్నారు. 


 టాలీవుడ్‌లో ఆఫర్ల కోసం కాళ్లరిగేలా తిరిగిన ఎంతో మంది నటీనటులకు ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షో మంచి వేధికగా మారింది.  జబర్ధస్త్ షోలో ఎక్కువగా కామెడీ స్కిట్స్ అంటే హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రాకెట్ రాఘవ వీరి స్కిట్స్ వస్తే కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిపోయే వారి సంఖ్య పెరుగుతోంది. లాక్‌డౌన్ సడలింపులతో ప్రత్యేక అనుమతులు తీసుకొని చాలా మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇలా వచ్చే వారికి తెలంగాణ  సరిహద్దుల్లోనే వైద్యులు పరీక్షలు జరుపుతున్నారు.


 ఇందులో భాగంగా జబర్ధస్త్ నటుడు రాకెట్ రాఘవకు కూడా వైద్య సిబ్బంది హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఏపీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఆయనకు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం శివారులోని పరీక్షలు చేశారు. ముందు జాగ్రత్తగా హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఆయన చేతికి ముద్ర కూడా వేశారు. కాగా జబర్ధస్త్ ద్వారా రాఘవ చాలా మందికి సుపరిచితం అయ్యాడు. పలు సినిమాల్లోనూ నటించిన సంగతి తెలిసిందే. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: