అందరు లాక్ డౌన్ టైం లో ఇళ్లల్లో ఉండి బి ద రియల్ మెన్ ఛాలెంజ్ చేస్తే నేను సినిమా చేశానని ట్వీట్ చేసి షాక్ ఇచ్చాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. లేటెస్ట్ గా ఆయన తీసిన కరోనా వైరస్ సినిమా ట్రైలర్ ప్రేక్షకులకే కాదు సినీ సెలబ్రిటీస్ కు షాక్ ఇచ్చింది. ట్రైలర్ అంతా చూపించి ఇది కంప్లీట్ గా లాక్ డౌన్ టైం లో షూట్ చేశానని చెప్పడం ఆర్జీవీ కొట్టిన దెబ్బకు మిగతా వాళ్లకు సౌండ్ లేకుండా పోయింది. అయినా లాక్ డౌన్ టైం లో అసలు ఆర్జీవీ షూటింగ్ ఎలా చేశాడబ్బా అని డౌట్ పడుతున్న వారు చాలామంది ఉన్నారు. ఇదిలాఉంటే ఆర్జీవీ లా ఫీల్ అవుతున్నాడో లేక ఆర్జీవికి పోటీ ఇద్దామని అనుకుంటున్నాడో కానీ అ! డైరక్టర్ ప్రశాంత్ వర్మ కూడా కరోనా వాక్సిన్ అంటూ ఓ సినిమా తీస్తున్నాడు. 

 

ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరోనా వాక్సిన్ 10 పర్సెంట్ కంప్లీటెడ్ ప్రిలిమినరీ టెస్ట్ రేపు ఉదయం 9 గంటలకు అంటూ ప్రశాంత్ వర్మ పెద్ద షాక్ ఇచ్చాడు. ఆర్జీవీ తరహాలోనే ప్రశాంత్ వర్మ కూడా టీజర్ ఏదైనా వదులుతాడా అంటూ డిస్కషన్స్ మొదలయ్యాయి. నాని నిర్మాతగా వచ్చిన అ! సినిమాతో ప్రేక్షకులను అలరించిన ప్రశాంత్ వర్మ ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా కల్కి సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. 

 

అందుకే ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మీద ఓ సినిమా మొదలు పెట్టాడు ప్రశాంత్ వర్మ. కరోనా వాక్సిన్ రేపు ఉదయం 9 గంటలకు వస్తుందని అన్నాడు. అయితే ఈ సినిమాకు టైటిల్ ఏంటి.. ఆర్జీవీ లానే కరోనా లాక్ డౌన్ టైం లోనే ప్రశాంత్ వర్మ ఈ షూటింగ్ చేశాడా..? చేస్తే ఎలా చేశాడు..? ఇలాంటి డౌట్స్ రేజ్ అవడం ఖాయం.

 

నిన్న ఆర్జీవీ ట్రైలర్ రిలీజ్ చేయడం.. ఆ వెంటనే ఈ వర్మ పోస్టర్ రిలీజ్ చేయడం చూసి.. ఆడియెన్స్ కన్నావర్మ ఎనౌన్స్ మెంట్ ఆ వర్మకు షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. మరి ప్రశాంత్ వర్మ సినిమా టైటిల్ ఏంటి..? సినిమా ఎలా ఉండబోతుందో రేపు రిలీజ్ అవుతున్న ప్రిలిమినరీ టెస్ట్.. అదే ఫస్ట్ లుక్ టీజర్ తో తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: