టాలీవుడ్ లో కొందరు పెద్దలు ఇప్పుడు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారా...? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. తాజాగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సినిమాల షూటింగ్ ల అనుమతుల కోసం ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలిసి మాట్లాడింది గాని వాళ్ళు జరిపిన చర్చలు గాని తనకు తెలియదు అని కేవలం తాను వార్తల్లో చూసి మాత్రమే విషయం తెలుసుకున్నా అని వ్యాఖ్యలు చేసారు అంటే ఆయనకు చెప్పకుండానే కొందరు పెద్దలు కేసీఆర్ ని మంత్రిని కలిసారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

బాలకృష్ణ ఆ విధంగా ఎందుకు వ్యాఖ్యలు చేసి ఉంటారు అనేది అర్ధం కాలేదు. అయితే ఇక్కడ కొందరు పెద్దలు స్వార్ధం గా  వెళ్లి షూటింగ్ ల కోసం ప్రభుత్వాన్ని కలిసారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి బాలయ్య చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. బాలయ్య చిన్న నటుడు కాదు ఆయనకు చెప్పకుండా ఏ విధంగా కలిసారు అనేది అర్ధం కాకుండా ఉంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి అనేక చర్చలు వినపడుతున్నాయి. 

 

సొంత పెత్తనాలు కొందరు చేసారని అంటున్నారు. అందరి సినిమాల షూటింగ్ లు ఆగిపోయినప్పుడు అందరిని కలుపుకుని వెళ్ళాలి అని కొందరు మాత్రమే  ఏ విధంగా వెళ్తారు అని ప్రశ్నిస్తున్నారు. దీని వలన సినీ పరిశ్రమ ఒకటి కాదు అనే సంకేతాలు వెళ్తాయని దాని వలన నష్టం జరుగుతుంది అని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై టాలీవుడ్ పెద్దలు ఎవరు కూడా ఇంకా స్పందించలేదు. ఇక బాలకృష్ణ మరి మున్ముందు ఇంకేం వ్యాఖ్యలు చేస్తారు అనేది చూడాలి కాగా నిన్న కూడా కొందరు వెళ్లి మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసిన సంగతి తెలిసిందే. వారిలో నిర్మాతలు కూడా ఉన్నారు. మరి సినిమాలకు తెలంగాణా ఓకే చెప్తుందా అలేదా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: