ఇప్పుడు కొందరు హీరోయిన్ లు మన తెలుగులో ఏ విధంగా అయినా సరే సినిమాలను చేయడానికి ప్రయత్నాలను చేస్తున్నారు. అగ్ర హీరోల సినిమాల్లో ఒక్క అవకాశం వచ్చినా చాలు అనుకునే విధంగా చాలా మంది హీరోయిన్ లు ఉన్నారు ఇప్పుడు. ఒక్క అవకాశం కోసం ఎదురు చూడటమే కాదు సినిమాలో చాన్సు వస్తే చాలుఇ తాము ఎంత వరకు అయినా సరే తగ్గి నటిస్తామని ఎక్కువ రేటు తాము తీసుకునే అవకాశం లేదని వాళ్ళు చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇక మన తెలుగులో ఇప్పుడు ఇతర భాషల హీరోయిన్ ల హవా ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. 

 

అగ్ర హీరోయిన్ అయినా చిన్నా హీరోయిన్ అయినా సరే ఇతర భాషల నుంచి వస్తున్న వారే అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక విషయం బయటకు వచ్చింది. హీరోయిన్ లతో కేవలం పాటలు మాత్రమే చేయించే విధంగా ఒప్పందం చేసుకోవడం మంచిది అనే అభిప్రాయానికి వచ్చారట. కొన్ని రోజుల పాటు హీరోయిన్ లను అది కూడా ఇతర భాషల హీరోయిన్ లకు ఎక్కువ ప్రాధాన్యత వద్దు అని ఖర్చు తగ్గించుకునే విధంగా వ్యవహరించాలి అని నిర్మాతలు భావిస్తున్నారు అని సమాచారం. ఏ సినిమా అయినా సరే ఇదే విధంగా వ్యవహరించడం మంచిది అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. 

 

ఇక ఎక్కువ డిమాండ్ చేసే హీరోయిన్ లను పక్కన పెట్టడమే మంచిది అనే భావన లో ఇప్పుడు ఉన్నారని తెలుస్తుంది. అగ్ర హీరోయిన్ అయినా చిన్న హీరోయిన్ అయినా సరే ఎక్కువ అడిగితే వద్దు అని చెప్పేస్తున్నారు. ఇక కొన్ని రోజులు ఐటెం సాంగ్స్ కూడా సినిమాల్లో ఉండే అవకాశం లేదు అని సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజం అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: