ఇప్పుడు నష్టాలను ఎదుర్కొంటున్న చిన్న చిన్న సినిమాల నిర్మాతలు ఏ విధంగా అయినా సరే వాటి నుంచి బయట పడటానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ విధంగా అయినా సరే నష్టాల నుంచి బయటకు రావడానికి ఆస్తులు అమ్మి అయినా సరే పెద్ద పెద్ద సినిమాలను చెయ్యాలని భావిస్తున్నారు. నిజమా కాదా అనేది పక్కన పెడితే ఇప్పుడు అగ్ర హీరోలతో అగ్ర దర్శకులతో సినిమాలు చేయడానికి మాత్ర టాలీవుడ్ లో చిన్న నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు అనే వార్తలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకు వినపడుతూనే ఉన్నాయి. 

 

ఇక ఇప్పుడు నిర్మాతలు హీరోల నుంచి కొన్ని కోరికలను కోరే అవకాశం ఉందని సమాచారం. అది ఏంటీ అంటే...  తమను ఇప్పుడు ఆదుకోవాలి అంటే మీరు కచ్చితంగా కొన్ని డిమాండ్ లు చేయవద్దు అని, సినిమా ముందు మార్కెట్ మొత్తం తమకు వదిలిపెట్టే ప్రయత్నం చెయ్యాలి అని వారు కోరుతున్నారు. ఇప్పుడు అది చేయకపోతే తాము చాలా వరకు నష్టపోయే అవకాశం ఉందని అంటున్నారు. అదే విధంగా హీరోయిన్ ల విషయంలో స్టార్ హీరోయిన్ లను వద్దు అని మీ రేంజ్ కి తగిన వారిని చూస్తామని చెప్పినట్టు తెలుస్తుంది. 

 

ఇక సినిమాలో మిగిలితే తాము కచ్చితంగా ఇస్తామని తమను  ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు అని వారు కోరుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు తో రామ్ చరణ్ తో ఎన్టీఆర్ తో సినిమాలు చెయ్యాలని కొందరు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని ద్వారా నష్టాల నుంచి బయటకు రావాలి అని వాళ్ళు భావిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో చిన్న చిన్న నిర్మాతలకు భారీ కష్టం వచ్చి పడిన సంగతి తెలిసిందే. వాళ్ళ సినిమాలు ఆగిపోవడం తో అటు వడ్డీలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. మరి ఎం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: