కొరటాల శివకు తెలుగులో ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన కమర్షియల్ దర్శకుడి గా మంచి గుర్తిపు కూడా తెచ్చుకున్నారు. అగ్ర హీరోలతో ఆయన వరుసగా సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్నారు ఇప్పటి వరకు ఆయన తొలి సినిమా నుంచి ఇప్పుడు చేసే సినిమా వరకు అన్నీ కూడా అగ్ర హీరోలతో చేస్తున్న సినిమాలే కావడం విశేషం. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆయన గురించి ఒక వార్త బయటకు వచ్చింది. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే ఆయన కొన్ని రోజులు గ్యాప్ తీసుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. 

 

దీనికి కారణం కూడా వేరే ఉందని సమాచారం. ఆయనకు రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ ఇప్పుడు చాలా వరకు బిజీ గానే ఉన్నాడు. రామ్ చరణ్ తో సినిమా చేయడానికి గానూ ఆయన ఒక కథను కూడా రెడీ చేసుకుని ఉంచుకున్నాడు అని సమాచారం. ఆ కథను వచ్చే ఏడాది సినిమాగా తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న రామ్ చరణ్ ఇప్పట్లో ఖాళీ అయ్యే అవకాశం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

రామ్ చరణ్ ఖాళీ అయిన తర్వాత ఆయన అతని తో సినిమా చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది, రామ్ చరణ్ కూడా ఆయన తో సినిమా చేయడానికి గానూ ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే ఇప్పుడు మంచి కథ ను సిద్దం చేసుకోవడానికి సమయం అడిగారు అని సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుంది. ఆచార్య సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యే సూచనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ దాదాపుగా అయిపొయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: