టాలీవుడ్ లో చిరంజీవి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే చాలు చాలా మంది ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు పనులు మానుకుని హాల్ కి వెళ్ళే వారు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కనపడుతూనే ఉంటారు. ఆయన సినిమా అంటే చాలా మందికి ఒక పండగ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. 

 

వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేస్తారు. ఇక ఈ సినిమాలో ఇప్పుడు కొన్ని కీలక పాత్రలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఒక పాత్రకు గానూ రామ్ చరణ్ ని తీసుకోవాలని దర్శకుడు కొరటాల శివ భావిస్తున్నారు అయితే రామ్ చరణ్ వద్దు అని  మహేష్ బాబు కావాలని చిరంజీవి అడుగుతున్నా సరే ఆయన వినడం లేదని తాను రామ్ చరణ్ ని అనుకున్నా అని  దయచేసి ఆ పాత్రకు ఆయన మినహా మరొకరు సెట్ అవ్వరు అని చిరంజీవి కి నచ్చజెప్పే ప్రయత్నం దర్శకుడు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 



ఈ సినిమాలో చివరికి రామ్ చరణ్ తోనే ఆ సన్నివేశాలను చేయించే ప్రయత్న౦ దర్శకుడు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశం ఉందని భావించినా సరే అది సాధ్యం కాలేదు. కాబట్టి వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది చూడాలి. ఈ సినిమా తర్వాత ఆయన లూసిఫర్ అనే సినిమాలో నటిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: