స్టార్ డైరెక్టర్స్ రాజమౌళి.. త్రివిక్రమ్ శ్రీనివాస్.. కొరటాలను  బాలయ్యతో సినిమాను ఎప్పుడని అడిగితే.. సమాధానం ఉండదు. అయితే ఓ స్టార్ డైరెక్టర్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో బాలయ్యను డైరెక్ట్ చేయాల్సిందే అంటున్నాడు. మూడేళ్లు నుంచి ప్రయత్నిస్తున్నా వర్కవుట్ కావడం లేదు. లాక్ డౌన్ టైమ్ లో కసిగా పనిచేసి.. బాలయ్యను కంటెంట్ తో మెప్పించాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇంతకీ బాలయ్యను డైరెక్ట్ చేయాలనుకుంటున్న ఆ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎవరో కాదు అనిల్ రావిపూడి. 

 

లాక్ డౌన్ హాలిడేస్ ను అనిల్ రావిపూడి 100పర్సెంట్ యూజ్ చేసుకుంటున్నాడు. ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమా కథను రెడీ చేసే అనిల్ రావిపూడి ఏకంగా మూడు నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఎఫ్ 2 కథ రాసుకోవడానికి ప్రకాశం జిల్లాలోని సొంత ఊరు వెళ్లాడు. ఈలోగా లాక్ డౌన్ ప్రకటించడంతో.. రెండు నెలలుగా అక్కడే ఇరుక్కుపోయాడు అనిల్. తన టీమ్ తో కలిసి ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 పూర్తి చేసి మరో సినిమా స్క్రిప్ట్ పై దృష్టి పెట్టాడు దర్శకుడు. 

 

అనిల్ రావిపూడి లాక్ డౌన్ టైమ్ లో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై దృష్టిపెట్టాడు.  బాలకృష్ణను డైరెక్ట్ చేయాలని చాలాకాలంగా వెయిట్ చేస్తున్నాడు. బాలకృష్ణ 100వ సినిమా కోసం కథ రాసుకున్నా ఆ ఛాన్స్ క్రిష్ కొట్టేశాడు. ఎప్పటికైనా తీస్తానని బహిరంగంగానే చెప్పాడు అనిల్. బాలయ్యను డైరెక్ట్ చేసేది ఎప్పుడో చెప్పకపోయినా.. ఆల్ రెడీ లైన్ రెడీ ఉందని లాక్ డౌన్ టైమ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు దర్శకుడు. 

 

లాక్ డౌన్ ఎప్పడికప్పుడు పొడిగించడం.. ఎఫ్ 3 స్క్రిప్ట్ పూర్తికావడంతో.. బాలయ్య కథపై కూర్చున్నాడు అనిల్. ఆల్ రెడీ అనుకున్న లైన్ కు చుట్టూ సన్నివేశాలు రాసుకొని.. స్క్రిప్ట్ ను ఓ కొలిక్కి తెచ్చాడట. లాక్ డౌన్ పూర్తి కాగానే.. బాలయ్యకు కథ వినిపిస్తాడని తెలిసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: